వీ డ్రీమ్స్ పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏడు లక్షల లంచం తీసుకున్నారని ఫిర్యాదుతో సస్పెండ్ అయిన ఉద్యోగులకు విశాఖలో తిరిగి రీ పోస్టింగ్ ఇచ్చారని దీనిని తక్షణమే రద్దు చేయాలని ప్రజాసంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల కు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 35 లక్షల బిల్లులు కాంట్రాక్టులకు విడుదల అయ్యాయని దానికి ట్రెజరీ అధికారులకు 7 లక్షలు ఇచ్చారని అప్పుటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ట్రెజరీ అధికారులను విచారించి వాస్తవం అని తేలడంతో ఈ విషయం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో 2023 మార్చి 23న ట్రెజరీ అధికారి, సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మారిపోవడంతో వీరు పైరవీలు జరిపి తిరిగి విశాఖకు రీపోస్టింగ్ ఉత్తర్వులు సంపాదించడంలో ఉమ్మడి విశాఖ ఖజానాలో చర్చనీయంగా మారింది. ఏజెన్సీలో సస్పెండ్ సిటీలో పోస్టింగ్ దీంతో ఖజానాలో అవినీతి అనకొండలకు మంచి ఆఫర్ అని వీటన్నింటిపై రాష్ట్ర డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ కార్యాలయానికి, లోకయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రజా సంకల్ప వేదిక ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షుడు జక్కు నరసింహమూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు
