వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి మండలం మార్టూరు గ్రామానికి చెందిన మాజీ జెట్పిటిసి సభ్యులు పోల్నాటి అప్పారావు వ్యవసాయ భూమిలో సుమారు 20 వేల రూపాయలు విలువచేసే వరి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేసారని శనివారం అనకాపల్లి రూరల్ పోలీసులకు పిర్యాదు చేసారు. అయితే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తన పొలం వద్ద తిరిగాడారని పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు. గడ్డి మేటు దగ్దం చేసి తనకు తీవ్రంగా నష్ట పరచిన వ్యక్తులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అప్పారావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
