వీ డ్రీమ్స్ అనకాపల్లి
నియమ నిభందన లకు నీళ్లు వదులుతూ, లంచాలు మేస్తున్న రెవెన్యూ, సర్వే ఉద్యోగులను అధికారులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గట్టిగా హెచ్చరించారు. వీరి సంగతి తనకు తెలిసినట్టు పరిస్థితి ఇలా కొనసాగితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేసారు. బుధవారం జిల్లాలోని రెవెన్యూ, సర్వే అధికారుల వెబెక్స్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. రీ సర్వే, ఆర్ఒఆర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక దరఖాస్తులు విషయంలో అధికారుల పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. రీ సర్వే లో లంచాల వసూలపై రైతులు దగ్గర నుండి వచ్చిన పిర్యాదు లను ఆమె తీవ్రంగా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ విధానంలో ప్రజలు నుండి సేకరిస్తున్న అభిప్రాయాలు ద్వారా అనకాపల్లి జిల్లాలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు వెలుగు చూడటంతో కలెక్టర్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి హెచ్చరిక జారీ చేసారని పరిశీలకులు భావిస్తున్నారు. అనకాపల్లి, చిత్తూరు, అల్లూరి, విశాఖ,నెల్లూరు జిల్లాల్లో విఆర్ఒ లపై పెద్దఎత్తున వస్తున్న ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రీ సర్వే సమయంలో సొమ్మలు వసూలు చేస్తున్న విషయం పై కూడ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఐవిఆర్ఎస్ విశ్లేషణ లో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగానే కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులకు వెబెక్స్ సమావేశాన్ని హుటాహుటిన ఏర్పాటు చేసారు. రీ సర్వే సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారం ఎంతవరకు వచ్చిందని అలాగే రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారం పురోగతి ఏవిధంగా ఉందని కలెక్టర్ వాకాబ్ చేసారు. ఏ ఒక్క అర్జీని వదిలి పెట్టకుండ పరిష్కరించాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ లో పారదర్శకంగా ఉండాలని చెప్పారు. రోలుగుంట తహసీల్దారు పనితీరు బాగులేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. రికార్డుల నిర్వహణ, ఆర్ఒఆర్ సమస్యల పరిష్కారంలో ఈ తహసీల్దారు శ్రధ చూపడం లేదని అన్నారు వెబెక్స్ కు హజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. గైర్హాజరు అయన అధికారులు, ఉద్యోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరు పై సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్య పరిష్కా వేదిక ద్వారా వచ్చిన అర్జీలకు సంబంధించి అర్జీలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న తహసీల్దారు లపై చర్యలు తప్పవని అన్నారు. అర్జీ దారులకు సరైన సమాచారం ఇవ్వకపోయిన నిర్లక్ష్యం చూపిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు అర్జీల పరిష్కార గడువు ముగిసిన అర్జీలు పెండింగ్‌లో ఉండటం పై తహసీల్దారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. త్వరలో మండలాలు వారీగా దీనిపై సమీక్షిస్తామని కలెక్టర్ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలియవచ్చింది. బుధవారం పైలట్ గ్రామంలో రీ సర్వే కు బయలుదేరిన సర్వేయర్ లు,విఆర్ఒ లను హుటాహుటిన వెనక్కి రప్పించి వెబెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం మద్యాహ్నం రీ సర్వే లో పాల్గొనాలని ఆదేశించారు. వెబెక్స్ సమావేశంలో కలెక్టర్ హెచ్చరికలు ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు రెవెన్యూ, సర్వే వర్గాల్లో కలకలం రేపు తున్నాయి అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ అక్రమాలు,మితి మీరుతున్న లంచాలు పై మీడియాలో వస్తున వరుస కధననాలు ప్రజలు నుండి అందుతున్న పిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు సంచలనం కలిగిస్తున్నాయి.
