వీ డ్రీమ్స్ అనకాపల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అనకాపల్లి మండలం కూండ్రం సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కూండ్రం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని మహిళల ఆధ్వర్యంలో ప్రమాణం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నందారపు సూరి బాబు, పచ్చికోరు రాము తదితరులు పాల్గొన్నారు.
