వీ డ్రీమ్స్ అనకాపల్లి
రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా నిరుద్యోగులు, ప్రభుత్వ విభాగాలలో సుమారు 2 లక్షల ఉద్యోగాల ఖాళీ లు, పదివేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ
చేస్తామంటే ఎలా రెండు సంవత్సరాలుగా నిరుద్యోగ యువతను ఊరించి ఊరించి ఉసురు మనిపించారు.
నిరుద్యోగ యువతకి ఎన్నికల హామీలొ ఇచ్చిన నిరుద్యోగ భృతి
అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తక్షణమే 50వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ప్రజా సంఘాల నేత చిన్ని యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజాసంఘాల ఐక్యవేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిన్ని యాదవ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తేు జాబ్ క్యాలెండర్ పేరట నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని యాదవ్ ఆవేదన వ్యక్తపరిచారు, రెండేళ్లుగా ఊరించి పదివేల పోస్టులకు నోటిఫికేషన్ తో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను నిరాశపర్చారని యాదవ్ అన్నారు, విద్యాశాఖలో బోధన బోధ నేతర పోస్టులు 30 వేలు,పోలీస్ శాఖలో 19,999,ఇంజనీరింగ్ విభాగంలో 20 వేలు, పంచాయతీరాజ్ 26 వేలు మున్సిపల్ శాఖలో 27, వేలు రెవెన్యూలో 13 వేలు వైద్యశాఖలో 26, వేలు వ్యవసాయ శాఖలో 3 వేలు పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఉన్న 1,80,000 పోస్టుల ఖాళీల భర్తీ ఎప్పుడని యాదవ్ అడిగారు, రెండేళ్ల తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన ఇచ్చింది కేవలం 10 వేల పోస్ట్లు కేనా అని మండిపడ్డారు, దేశంలో నిరుద్యోగ సంఖ్యతో పోలిస్తే రాష్ట్రంలో 50% మంది నిరుద్యోగులు ఉన్నారని, రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వారిలో 30 లక్షల మంది పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారని, పదివేల ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగ యువతను ఊరించి ఊరించి ఉసురుమనిపించినట్టే అని యాదవ్ అన్నారు, అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని యాదవ్ అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని యాదవ్ అన్నారు.

