వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రజలు వినియోగించే రహదారి పై గోడ నిర్మించి రహదారిని మూసి వేయడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టించడం విడ్డూరంగా ఉందని బాధితులు తమ ఆవేదనను విలేకరుల ముందు వెలిబుచ్చారు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి పట్టణంలోని రఘురాం లేఔట్ లో బుద్ధ మురళి తాతారావు అనే వ్యక్తికి వుడా లేఅవుట్ రోడ్డును ఆనుకొని ఇంటి స్థలం ఉండగా ఆ స్థలానికి అడ్డుగా కాలనీవాసులు రోడ్డుపై గోడ కట్టి దారి లేకుండా చేయడంతో జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. అయితే తనకున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో అనకాపల్లి గవరపాలెం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మురళి తాతారావు చెందిన సర్వే నెంబరు 1535-3 లో ఉన్న ఇంటి స్థలాన్ని గవరపాలెం చెందిన విల్లూరు గణేష్ తో పాటు మరో ఇద్దరికి క్రియ పురోని రాశానని చెప్పారు. అయితే కాలనీవాసులు రోడ్డుకు అడ్డుగా కట్టిన గోడను తొలగించడం తో కాలనీవాసులు నాపైన ఎగ్రిమెంట్ రాసుకున్న వారి పైన పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని అన్నారు. వివాద రైతంగా ఉంటానని నా వ్యక్తిగత విషయాలను పట్టణంలో ఎవరిని అడిగినా చెప్తారని ఆయన అన్నారు. జీవీఎంసీ అధికారులు వచ్చి పరిశీలించారని రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని తొలగించాలని లేకుంటే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారని ఆయన తెలిపారు. రహదారికి అడ్డుగా గోడ కట్టడం చట్టరీత్యా నేరమని మున్సిపల్ అధికారులు చెప్పిన మున్సిపాలిటీ అధికారులపై కాలనీవాసులు విరుచుకుపడ్డారని అన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 285 (గతంలో ఐపిసి సెక్షన్ 283) ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో లేదా రహదారిపై ప్రజలకు ఇబ్బంది, అడ్డంకి లేదా ప్రమాదం కల్పించే విధంగా గోడ కట్టడం ఈ సెక్షన్ కింద చట్ట రిత్యా నేరం రహదారికి అడ్డంగా గోడ కడితే జరిమానా విధించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం( లేదా స్థానిక సంస్థల చట్టాలు) అనుమతి లేకుండా రోడ్డును ఆక్రమించి లేదా ప్రజలకు ఇబ్బంది కలిగేలా గోడ కడితే ఆయా మున్సిపల్ చట్టాల ప్రకారం అక్రమ కట్టడాన్ని తొలగించడంతో పాటు జరిమానా విధిస్తారు.
ఉడా రోడ్డు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటూ కాలనీకి చెందిన ఒక వ్యక్తి డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉడా లేఔట్ పూర్తయిన తర్వాత ఆ లేఔట్ లో ఉండే రోడ్లు, డ్రైనేజీ, అలాగే పార్కు వంటి స్థలాలను మున్సిపాలిటీలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రోడ్లన్నీ మున్సిపాలిటీ పరిధిలో ఉండగా చట్టాన్ని చేతులకు తీసుకొని రహదారిపై గోడ కట్టడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణ పోలీసులకు స్థల యజమాని ఫిర్యాదు చేశారు.




