వీ డ్రీమ్స్ విజయనగరం
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ వాస్తవాలను దాచిపెట్టి అడ్డగోలుగా మాట్లాడటానికి అలవాటుపడిపోయారని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి విమర్శించారు మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర లో జరిగిన అవినీతి అక్రమాలు,ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన భూ కబ్జాలు పై బొత్స సత్యనారాయణ మాట్లాడితే బాగుంటుందని,తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో విశాఖపట్నం కేంద్రంగా జరిగిన భూ కబ్జాలపై వేసిన సిట్ రిపోర్ట్ ని వైకాపా ప్రభుత్వం ఎందుకు విడుదల చెయ్యలేదని ప్రశ్నించారు, ఉత్తరాంధ్ర లోని పాయకరావుపేట, ఏటికొప్పాక,అనకాపల్లి, భీమసింగీ కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ లను ఎందుకు మూసివేశారని,విశాఖపట్నం లోని ప్రభుత్వ ఆస్తులను ఎందుకు తాకట్టుపెట్టారని, ఉత్తరాంధ్ర నుండి వలసలను ఎందుకు ఆపలేక పోయారని,కొత్త పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు మూతవేశారని,లక్షల ఎకరాలకు నీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తో పాటుగా ఒక్క సాగు,త్రాగునీరు ప్రోజెక్టునైనా పూర్తిచేయ్యడంగాని,నిధులు మంజూరు చెయ్యడం గాని చేసారా అని భీశెట్టి ప్రశ్నించారు, ఉత్తరాంధ్ర లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు,ఒక స్పీకరు, ముగ్గురు మంత్రులు,ఎమ్మెల్యేలు ఉండి కూడా విశాఖపట్నం కేజీహెచ్ ని గాని,విమ్స్ ని గాని సందర్శించి రోగుల సమస్యలు తెలుసుకొని మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నుండి అదనపు నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో సంక్షోభం సృష్టించారని దాన్ని గొప్ప అభివృద్ధి అని చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు,బొత్స సత్యనారాయణ కి ప్రజాసమస్యలు తెలిసి కూడా ప్రజాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని,విభజన హామీలను సాధించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని,ప్రభుత్వం అన్ని వ్యవస్థ లని పతనం చేసిందని ప్రజలు గుర్తించారని భీశెట్టి గట్టిగా ఆరోపించారు ఈ సమావేశంలో పిడకల ప్రభాకరరావు, జలంత్రి రామచంద్రరాజు,అల్లంశెట్టి నాగభూషణం, శిమ్మశ్రీను తదితరులు పాల్గొన్నారు.
