వీ డ్రీమ్స్ అనకాపల్లి
దేశంలో ఎన్నికలు ప్రక్రియ సజావుగా జరగాలని అనకాపల్లి కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతల రామకృష్ణ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నతరా రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ముందుగా ఓటర్ లిస్ట్ సక్రమంగా ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. గత 35 సంవత్సరాలగా ఎన్నికలను చూసాము కానీ ఎప్పుడూ ఇలాంటి ఓటర్ లిస్ట్ చూడలేదని అన్నారు. ఇప్పుడున్న ఓటర్ లిస్ట్ చూస్తే అయోమయానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సుమారు 35 వేల బోగస్ ఓట్ల కార్డులను డౌన్లోడ్ చేసుకొని అధికార పార్టీ గెలుపొందడం జరిగిందని కొణతాల ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 18 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరిగిందన్నారు.ఇది పొరపాటున జరిగి ఉంటే తప్పు కాదని కానీ అధికార పార్టీ ఉద్దేశపూర్ంగానే చేస్తుందన్న అనుమానం మాకు ఉంది అని అన్నారు.ఇంకా అనకాపల్లిలో ఒకే డోర్ నెంబర్ పై 200 నుంచి 300 వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని తక్షణమే ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఇలాంటి వాటిని తొలగించవలసిన అవసరం ఉందని రామకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ , తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ బుద్ధ నాగ జగదీశ్వరరావు , మల్ల సురేంద్ర , పొన్నగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.