వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్, ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ లు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా సమాజాన్ని చైతన్యం చేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను గుర్తు కు తెచ్చుకున్నారు. వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర, మరియు ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు.