వీ డ్రీమ్స్ అనకాపల్లి
కూటమి అధికారులకు వస్తే ఇక్కడ సరదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య కాలువ మరమ్మతులు చేపడతామని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఇక్కడ శారదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య గ్రోయిన్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో గ్రోయిల్ మరమ్మతు కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ శారదా నదిలో గ్రోయిన్లు దెబ్బ తినడంతో నీరు వృధాగా పోతుందని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి హయాంలో 11 ఆనకట్టలు ఉన్నాయని వీటిలో ఎల్లయ్య ఆనకట్ట సుమారు 5 మండలాలకు సంబంధించి 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తోడ్పడుతుందని. దురదృష్టవశాత్తు ఈ ఆనకట్టలు శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులకు సాగునీరు అందకుండా పోతుందన్నారు. జరిగిన ఐదేళ్ల వైసిపి పాలనలో కనీసం ఈ ఆనకట్టని మరమ్మత్తులు నిమిత్తం ఒక్క ఇసుక మూటను కూడా అడ్డువేసి రైతులకు నీరు అందించే చర్య ఏ ఒక్కరోజు చేయలేదని కొణతాల ఎద్దేవ చేశారు. రాజశేఖర్ రెడ్డి రైతులు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అయితే ఆయన తనయుడు ఆయన్ను అనుసరించి చేస్తాడన్న ప్రజలందరూ అనుకున్నారు కానీ ఆయనకి విరుద్ధంగా పరిపాలన సాగిందన్నారు. ఏ ఒక్కటి కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా చేయలేదని పోలవరం ప్రాజెక్టు గానీ సుజల స్రవంతి గాని కనీసం చిన్నచిన్న ఆనకట్టలు కూడా ఏ ఒక్కటి కూడా రైతులకు సాగునీరు అందించే విధంగా కనీస మరమ్మత్తులైన చేయించలేదని ఆయన ఆరోపించారు.పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే 11 ఆనకట్టలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాశ్వతంగా రైతులకు ఉపయోగపడే విధంగా పునర్ నిర్మాణం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ తో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం.రమేష్ తనయుడు రుత్విక్ , బిజెపి నాయకులు పొన్నగంటి అప్పారావు , బొద్దపాటి రాంకుమార్ , కర్రి బాబీ , పీలా విశ్వేశ్వరరావు , రాపేటి రాంకుమార్ మరియు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
