కొణతాలకు అడుగడుగునా నీరాజనం

వీ డ్రీమ్స్ అనకాపల్లి

గెలుపే లక్ష్యంగా అనకాపల్లి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కొణతాల రామకృష్ణకు అడుగడుగునా కూటమి నాయకులు స్వాగతం పలుకుతున్నారు. గ్రామాల్లో చేపడుతున్న కాఫీ విత్ కేడర్ కార్యక్రమాల్లో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ చురుగ్గా పాల్గొంటున్నారు. సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేస్తూ కొణతాల ముందుకు సాగుతున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలన అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. గెలిచిన నాయకులు తమ స్వార్థం కోసం సంపాదన ధ్యేయంగా ఆలోచించారు తప్ప ప్రజా సమస్యలపై కనీసం దృష్టి సారించలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్ జిఎస్ పథకం కింద పనిచేసే ప్రజలను ఆయన పలకరిస్తున్నారు. కూటమి అధికారులకు వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తామని హామీ ఇచ్చారు. ఎండ వేడిమి నీ కూడా లెక్కచేయకుండా కొణతాల ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు. ఆయా గ్రామాల్లోని సమస్యలను ఇబ్బందులను కొణతాల అడిగి తెలుసుకుంటున్నారు. కొణతాల ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా పెద్ద ఎత్తున యువత మహిళలు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తగరంపూడి గ్రామంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ
తగరంపూడి గ్రామంలో కొణతాలకు సంఘీభావం తెలిపిన మహిళలు
Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *