వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న బి కృష్ణారావు అనే వీఆర్వో ఆదివారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో తీవ్ర అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. వివరాల్లోకి వెళితే ఎన్నికల విధుల్లో భాగంగా ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన కృష్ణారావు అక్కడ నుండి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి బయలుదేరుతుండగా ఆర్డీవో కార్యాలయం వద్ద కృష్ణారావు బ్రెయిన్ స్ట్రోక్ తో కుప్ప కూలిపోయారు. అక్కడే ఉన్న ఆర్డీవో కార్యాలయం సిబ్బంది కృష్ణారావును ఆసుపత్రికి తరలించేందుకు 108 కి సమాచారాన్ని అందజేశారు. అయితే 108 వాహనం ఎంతకీ రాకపోవడం అంతలోనే కార్యాలయానికి వచ్చిన అనకాపల్లి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సంజన సునీల్ ఆటోను తీసుకొని వచ్చి కృష్ణారావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని సహచర వీఆర్వోకు సమాచారాన్ని చేరవేశామని ఆయన తెలిపారు. అప్పటికే కృష్ణారావు పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీ హెచ్ కి తరలించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. గత నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వీఆర్వో కృష్ణారావు ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే విఆర్ఓ కృష్ణారావు కోమలో ఉన్నట్లు తెలిసింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న కృష్ణారావు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అండగా నిలవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఇదిలా అనకాపల్లి గ్రామ రెవిన్యూ అధికారులు కృష్ణాల కుటుంబానికి అండగా నిలిచారు.