జిల్లాలో వాలంటీర్ల బలవంతపు రాజీనామాల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు వాలంటీర్ల వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించిన్నట్లు గా తెలుస్తున్నది .ఇప్పటికే జిల్లాలో అనేక మండలాల్లో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 9 వేల పైచిలుకు వాలంటీర్లు ఉండగా ఇంతవరకు సుమారు 12 వందల మంది రాజీనామాలు జిల్లా అధికారి ఒకరు “వీడ్రీమ్స్” కు తెలిపారు.ఈ నెల 10న అనకాపల్లి మండలం తుమ్మపాల సచివాలయం చెందిన సుమారు 30 మంది వాలంటీర్లు రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాలను అనకాపల్లి మండలానికి చెందిన ఒక సీనియర్ వైసిపి నాయకుడు వాలంటీర్లను తమ ఇంటికి పిలిపించుకొని వారి చేత బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించినట్లు తెలిసింది. ఒక మహిళా వాలంటీర్ రాజీనామా చేయడానికి ఇష్టం లేక తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది రోధిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. వైసీపీ నాయకునికి 30 మంది రాజీనామా లేఖలు అందించగా వీరిలో కొందరు శుక్రవారం ఎంపీడీవోను కలిసి తమ లేఖలను అందించినట్లు బోగట
మిగిలిన వారిని వైసీపీ నాయకులు పిలిచిన స్పందించ లేనట్లు తెలిసింది. అలాగే నిన్న కోట్ని వీధి లోని మరిడీ తల్లి గుడి వద్ద ఆ ప్రాంత సచివాలయ వాలంటీర్ల నుండి ఒక వైసీపీ నాయకుడు రాజీనామా లేఖలను తీసుకున్నట్లు తెలిసింది. బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించి నట్లు తెలిసింది. మాతో బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించుకొని ఆ రాజీనామా పత్రాలను తీసుకువెళ్లడం ఏమిటని పలువురు వాలంటీర్లు కాస్త స్వరం పెంచి అడిగినట్లు తెలిసింది. అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కొందరు వాలంటీర్లు చేసేది లేక రాజీనామా పత్రాలపై సంతకాలు చేసి వైసిపి నాయకుని చేతిలో పెట్టినట్లు తెలిసింది. తక్షణమే వైసీపీ నాయకుల కదలికలపై నిఘా పెట్టాలని తెలుగుదేశం జనసేన బిజెపి కోటమి నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. వాలంటీర్ల బలవంతపు రాజీనామాలపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ ప్రచారంలో పాల్గొనాలని అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. గత ఐదేళ్ల పాలనలో వాలంటీర్లు ప్రజలతో మమేకమై ఉండడం నిత్యం వారితో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాలంటీర్లు తో ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందని,వారిని ఎన్నికల్లో ప్రచారం కోసం ఉపయోగించుకోవచ్చు అని అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ కారణంగానే వాలంటీర్ల తో ఈ రాజీనామాలు చేయిస్తున్నారనే ప్రచారం వినిపిస్తుంది. ఎందుకు రాజీనామాలు చెయ్యమని ఒత్తిడి తీసుకు వస్తున్నారు అని
ఒక వాలంటీర్ అధిక పార్టీ నాయకుల్ని ప్రశ్నించినట్లు తెలిసింది. తుమ్మపాల సచివాలయం పరిధిలో సుమారుగా 80 మంది వాలంటీర్లు ఉండగా వీరిలో ఇప్పటివరకు సుమారుగా 30 మంది రాజీనామా చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనాప్పటికీ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేయడానికి ఇష్టం లేకుండా తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించడాన్ని లోలోపలే మధనపడుతున్నట్లు తెలిసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే మా భవిష్యత్తు ఏమిటని వాలంటీర్లు అధికార పార్టీ నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు అధికార పార్టీ నాయకుల నుంచి ఎటువంటి స్పందన రాలేనట్లు తెలిసింది.