వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ఎండి ఆపరేటర్లు పాల్గొనకూడదని అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ జిల్లాలో అనేక చోట్ల అధికారుల ఆదేశాలను బే ఖాతర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీకి ఓటు వేయాలని వాలంటీర్లు, ఎండి ఆపరేటర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు, బహిరంగంగానే పార్టీ జెండాలను పట్టుకుంటూ కండువాలు వేసుకుంటూ ఈ ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం విచారకరం, ఎన్నికల కమిషన్ ఇటు వాలంటీర్లను అటు ఎండి ఆపరేటర్లు ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది, ఎన్నికల ఆదేశాలను ఇక్కడ అధికారులు తుంగలో తొక్కినట్టే చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఎండి ఆపరేటర్ యన్నంశె టి సత్యనారాయణ ఎలియాస్ శ్రీను అధికార వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా గ్రామంలో ప్రచారం చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ విధుల్లో పనిచేస్తూ అధికార పార్టీకి మద్దతుగా ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని గ్రామంలోని తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. తక్షణమే సత్యనారాయణ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రాజీనామా చేస్తా : ఎండి ఆపరేటర్
ఈ విషయమై తగరంపూడి ఎండి ఆపరేటర్ సత్యనారాయణ వివరణ కోరగా పార్టీ అంటే అభిమానం అని జగన్మోహన్ రెడ్డి నాకు ఉద్యోగం కల్పించాడని ఆ అభిమానంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నానని అవసరమైతే రాజీనామాకు సిద్ధమని తగరంపూడి ఎండి ఆపరేటర్ సత్యనారాయణ ‘వీ డ్రీమ్స్’ కు బదులిచ్చారు