వీ డ్రీమ్స్ – అనకాపల్లి
ఇక్కడి శారద నదిలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. నిబంధన ప్రకారం గా ఇక్కడి శారదా నదిలో ఇసుకను తీయకూడదు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఇక్కడ అమలు కావు. ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక గ్రోయిన్ లు ఉన్నాయి. దీంతో సరదా నదిలో ఇసుకను తీయడాన్ని నిషేధించారు. అయినప్పటికీ తగరంపూడి శారదా నదిలో ఇసుకను యదేచ్ఛగా దొలిచేస్తున్న ఏ అధికారి కూడా కనీసం స్పందించటం లేదు. స్పందనలో లెక్కకు మించి ఫిర్యాదులు వెళ్తున్న అప్పటికప్పుడు తూతూ మంత్రంగా స్పందన ఫిర్యాదులను మామ అనిపిస్తున్నారు. కానీ ఇక్కడ తగరంపూడి గ్రామంలో ఉన్న శారదా నదిలో నిత్యం ట్రాక్టర్లతో ఇసుకను దోలిచేసి అమ్మేస్తున్నారు. నిత్యం ఇక్కడ సాధారణ లో అక్రమంగా ఇసుకను దొలిచేస్తున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కనుసైగల్లో ఈ ఇసుక అక్రమ దందా నడుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శారద నదిలో బెల్లం పెనాల ద్వారా తీసి ఒడ్డుకు తరలించి ఆపై ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్ల ద్వారా వేలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ మీరా సాహెబ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన వచ్చేటప్పటికి శారద నదిలో ఇసుకను తీస్తున్న దృశ్యాలు ఆయన కంటికి చిక్కాయి. శారదా నదిలో ఇసుకను తీయకూడదని వారందరికీ హెచ్చరిక జారీ చేసి మరో మారు ఇసుకను తీసే ప్రయత్నం చేస్తే కేసు నమోదు చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరా సాహెబ్ హెచ్చరించి విడిచిపెట్టారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. కాగా మీరా సాహెబ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి బదిలి అయిన విషయాన్ని ఇసుక దొంగలు తెలుసుకొని యధాతధంగా శారద నదిలో ఇసుకను దొలిచేస్తున్నారు. తగరంపూడి గ్రామానికి చెందిన ఒక ముఠా ఉదయం 5 గంటల నుంచి పది గంటల వరకు బెల్లం పెన్నాల ద్వారా శారద నదిలో ఇసుకను తీసి ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిన్ననే జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ తుమ్మపాల శారదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య గ్రోయిన్ ను పరిశీలించిన విషయం పాఠకులకు విదితమే. శారద నదిలో విచ్చలవిడిగా ఇసుకను దొలిచేయడం వల్ల నదిలో నిర్మించిన గ్రోయిన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అనేకమార్లు రైతు సంఘాలు జిల్లా కలెక్టర్లకు లెక్కకు మించి ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం స్థానికంగా కొందరి చేత సరదా నదిలో ఇసుకను తీయించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికుల నుంచి రైతు సంఘాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు అక్రమ ఇసుక దారులపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వలన ఇసుక దొంగలు బరితెగించి రెచ్చిపోయి శారదా నదిలో నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల శారదా నదిలో నిర్మించిన గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శారద నదిలో ఇసుకను తొలగించే ప్రతి ఒక్కరి పైన పోలీస్ అధికారుల చేత బైండెవర్ చేయించి ఉంటే ఇసుకను తీసే పరిస్థితి ఉండేది కాదని ఇటు రైతులు అటు ప్రజా సంఘాలు అంటున్నాయి. ఇప్పటికే ఇక్కడ శారద నదిలోని ఒక గ్రోయిన్ ను బాంబు పెట్టి పేల్చిన సంఘటన గతంలో చోటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇసుక దొంగలు ఇసుకను తీసుకునేందుకు ఈ గ్రోయిన్ ను బ్లాస్టింగ్ చేశారని గతలో రైతులు జిల్లా కలెక్టర్ కె ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. శారద నదిలో ఇసుకను దోచేయడం వల్ల సుమారు 300 గ్రామాల్లో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి తగనంపూడి లోని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్టు వేసి అందుకు బాధ్యులు లైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.