వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఉగాది పురస్కరించుకొని అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర ఇంటికి అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ అలాగే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా గోవింద సత్యనారాయణ ఇతరులు విచ్చేశారు. సురేంద్ర ఆహ్వానం మేరకు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఉగాది పచ్చడి అందించారు. సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మల్ల సురేంద్ర ఇంట్లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఉగాది వేడుకలకు సురేంద్ర ఆహ్వానించడం ఒక కుటుంబ సభ్యుడిగానే భావించి హాజరయ్యమని సీఎం రమేష్ తనయుడు రిత్విక్ అన్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొంత రామకృష్ణ మాట్లాడుతూ ఉగాది పురస్కరించుకొని సురేంద్ర సభ్యులు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సురేంద్ర చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమోఘమని అన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీకి ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమంలో పాల్గొని అనేకమంది పేద ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు తదితరులు సురేంద్ర ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొని సురేంద్రను అభినందించారు. కార్యక్రమంలో మల్ల రాజా, మల్ల నర్సింగ్ రావు, మల్ల సీతారాం, డాక్టర్ మురళి, మల్ల సంతోష్, విల్లూరి సూరిబాబు, పోలవరపు త్రినాథ్, బోధపు త్రినాథ్, మాదంశెట్టి మాదంశెట్టి నీల బాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కూటమి అభ్యర్థులను సురేంద్ర ఘనంగా సత్కరించారు.