వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి వికలాంగులకు రాబోయే త్వరలో మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి అనకాపల్లి జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు ..సోమవారం రింగ్ రోడ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం జరిగింది.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ 6000 రూపాయలకు పెంచడం జరుగుతుందని చంద్రబాబు ఇచ్చిన హామీ దివ్యాంగుల జీవితాల్లో వెలుగును నింపింది అన్నారు. ఆర్దిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వికలాంగులకు చంద్రబాబు నిర్ణయం ఆనందాన్ని కలిగించిందన్నారు.. దివ్యాంగులు భయపడాల్సిన పని లేదన్నారు ..వారికి అండగా నిలవడం జరుగుతుందన్నారు . ముందుగా పి లా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు వికలాంగులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందజేయడం జరిగిందన్నారు వారికి ఆపరేషన్లకు నిధులు కేటాయించామన్నారు.. చంద్రబాబు ఆరెస్ట్ చేసినప్పుడు వికలాంగుల పడ్డ వేదన అంతా కాదన్నారు.. జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగులను దేవుడు పుత్రులుగా భావించి దివ్యాంగులుగా నామకరణం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు.. ముందుగా వికలాంగులు చంద్రబాబు హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు పాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు.. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నాదముని ఫణీంద్ర తెలుగుదేశం నాయకులు మల్ల సురేంద్ర షేక్ బాబర్ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు చంద్రబాబుకు అనగువంగా నినాదాలు చేశారు.
