పూర్తయిన ఈవీఎం వివి ప్యాడ్ ల ర్యాండమైజేషన్ : జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి

వీ డ్రీమ్స్ కలెక్టరేట్

ప్రధాన ఓటర్ల నమోదు అధికారి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి.ప్యాడ్ ల మొదటి ర్యాండనైజేషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన జాతీయ నాలుగు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టణన్ శెట్టి తెలిపారు.

మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా పార్లమెంట్ నియోజకవర్గంలో ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వివి ప్యాడ్లు ఈ క్రింద తెలియజేసిన విధంగా కేటాయింపు చేయడమైనది.

మొదటి ర్యాండమైజేషన్ అయిన తరువాత వాటి వివరములు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయడం జరిగినది. తదుపరి కేటాయింపు చేయబడిన వివి ప్యాడ్ లు అన్నింటికీ స్కానింగ్ చేసి సదరు ఈవీఎంలను జి పి ఎస్ ట్రాకింగ్ కలిగిన వాహనములలో తగిన భద్రత ద్వారా అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కేంద్రాలకు అక్కడి స్ట్రాంగ్ రూములకు తరలించడం జరిగినది. ఈ ర్యాండ్ మైజేషన్ ప్రక్రియలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, జిల్లా రెవిన్యూ అధికారి బి దయానిధి, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు ఏ చిన్నికృష్ణ, హెచ్.వి. జయరాం, కె. గీతాంజలి, జీ.వి.సత్యవాణి, కే.మనోరమ, రాజకీయ పార్టీల ప్రతినిధులు కే హరినాధ బాబు( ఆప్), బి శ్రీనివాసరావు (తెలుగుదేశం), పి నాగేశ్వరరావు (బిజెపి) శంకరరావు( సిపిఎం) తదితరులు పాల్గొన్నారు
వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రవి పఠాన్ శెట్టి
Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *