వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే రాష్ట్రంలో 33 మంది పింఛనుదారుల మృతికి కారణమయిందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శనివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కతోవ పట్టించిన సీఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా వ్యవహరించి పింఛను దారులను కావాలనే నాలుగయిదు కిలోమీటర్లు నడిపించారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని,సీఎస్ ప్రజల పక్షాన ఆలోచించక పోవడం తో ఎండ వేడి తో పాటుగా రాష్ట్రంలో రాజకీయవేడి పెరిగిందని రాష్ట్రంలో 15 వేల సచివాలయాలు ఉంటే 66 లక్షల మంది పింఛను దారులు ఉన్నారని రాష్ట్రంలో వాలేంటీర్ల అవసరం లేకుండా 1 లక్ష 34,694 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వీరు అందరూ కేవలం రెండు రోజుల్లోనే ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందించవచ్చని భీశెట్టి అన్నారు,40 డిగ్రీల ఉస్ట్నోగ్రత బయట ఉంటే వృద్ధులు ఎలా సచివాలయంకి వెళ్లగలరని,ఆమాత్రం ఆలోచన లేని పరిస్థితి లో రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారా అని ప్రశ్నించారు, పింఛన్లు అందించే సచివాలయం వద్ద సామియాన,త్రాగునీటి ఏర్పాట్లు కూడా చెయ్యలేదని,పంచాయతీల్లో నిధులు లేవని సర్పంచ్ లే గగ్గోలు పెడుతున్నారని,కేంద్ర ఆర్థిక సంఘం నుండి వచ్చిన 8 వేల కోట్ల రూపాయల నిధులను మళ్లించిన ప్రభుత్వం పై పంచాయితీ రాజ్ సమాఖ్య నేటికి యుద్ధం చేస్తోందని,సీఎస్ రాష్ట్ర ప్రజలకా,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కా తెలియని పరిస్థితి ఏర్పడింది భీశెట్టి ఎద్దేవా చేశారు, వచ్చే మే నెల ఒకటి,రెండు తేదీల నాటికయిన సీఎస్ పింఛన్ దారుల ఇంటికి పింఛన్లు అందించే ఏర్పాట్లు చెయ్యాలని, వైకాపా కి అనుకూలం గా పనిచేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ని కోరారు,ఈ సమావేశంలో పార్టీ నాయకులు కొలసాని రమణ,ఆయకట్టు రైతుల ప్రతినిధి పెంటకోట వరప్రసాద్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.