వీ డ్రీమ్స్ పరవాడ పరవాడ మండలం పరవాడ ఫార్మసిటీలో ఆదివారం జరిగిన ప్రమాదాలపై సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి ని కలిసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, బుధవారం మెమోరాండం అందజేశారు ఈ లేఖలో అపి టోరియా, ఆల్కలి మెటల్స్ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు గాయపడ్డ కార్మికులందరికీ మెరుగైన వైద్యం అందించాలని, పనిపై శిక్షణ ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని, అధిక పని ఒత్తిడి, అధిక పనిగంటలు వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జరిగిన ప్రమాదాల్లో కార్మికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు గాయపడ్డ కార్మికులు పూర్తిగా కోలుకునే వరకు వేతనం, నష్టపరిహారం చెల్లించాలని కోరారు.ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో సమగ్ర విచారణ చేయించి యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు