బయ్యవరంలో కాలేజీ బస్సు బీభత్సం ఒక బాలుడు మృతి పలువురికి గాయాలు

వీ డ్రీమ్స్ కసింకోట

కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై మద్యం సేవించి బస్సు నడిపిన స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గౌస్ మొహిద్దిన్ 13 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మునిషా బేగం అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు అలాగే మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే పెందుర్తి చెందిన సరి మునిసా బేగం కుమారుని వివాహం సందర్భంగా తెగడ లోని దర్గా వద్ద పెళ్లి కార్డు కారులో ప్రయాణం అయ్యారు. అయితే పెందుర్తించి బయ్యారం వచ్చిన మునిసా బేగం టిఫిన్ ల కోసం బయ్యవరం జాతి రహదారిపై రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేస్తుండగా అవంతి కాలేజీకి చెందిన కాలేజీ బస్సు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడంతో అక్కడ టిఫిన్ చేస్తున్న గౌస్ మొహుద్దిన్ బాలుడు పైన బస్సు ఎక్కించకపోవడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా మునిసి బేగం కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలు అవ్వడంతో వీరిని హుటా హుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు
అనకాపల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఎలా గోవింద సత్యనారాయణ బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హుటాహుటిన ఎన్టీఆర్ ఆసుపత్రికి వచ్చి ముత్తుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆస్పత్రి వర్గాలతో మీరు మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *