వీ డ్రీమ్స్ ప్రతినిధి, అనకాపల్లి
మామిడి పాలెం గ్రామంలో స్టోన్,క్వారీ పొల్యుషన్ కారణంగా ఇక్కడి ప్రజల కిడ్ని వ్యాది సోకి అనారోగ్యానికి గురవుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ పూడి పరిదేశి నాయుడు గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఒక పిర్యాదు పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేసినారు.2022 లో కెజిహెచ్ వైద్య బృందం గ్రామంలో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారని అనేక మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామస్థులు త్రాగే నీటిని మట్టిని,పరీక్షలు నిర్వహించారని గాలి ద్వారా ఇక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు వైద్యులు తెలిపారని ఆ పిర్యాదు లో పేర్కొన్నారు.ఇంతవరకు కిడ్నీ వ్యాధి వలన సుమారు 20 మంది మృతి చెందారని ఈ విషయమై పలుమార్లు పిర్యాదు చేసినా అధికారులు స్పందించక పోవడం భాదకరమని అన్నారు. ఇప్పటికే గ్రామంలో సుమారుగా 30 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని వీరు డయల్ సిస్ చెయ్యించుకుంటున్నారని రెవెన్యూ సదస్సులో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు. తక్షణమే గ్రామంలో ఉన్న క్వారీలు,స్టోన్ క్రషర్లను శాశ్వతంగా మూసివేసి మా గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పరదేశి నాయుడు రెవెన్యూ అధికారులని కోరారు.