వీ డ్రీమ్స్ ప్రత్యేకం
దేశమంతా రాజకీయాలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల చర్చలతో మోగిపోతుంటే… సోషల్ మీడియాలో మాత్రం ఒక విచిత్రమైన ప్రేమకథ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
“కత్తిలాంటి ఆంటీకి… కత్తిలాంటి కుర్రాడు ఫిదా!” అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన 21 ఏళ్ల యువకుడు… ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. జీవితంలో ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెట్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ అతని జీవితంలో ట్విస్ట్ Instagram ద్వారా వచ్చింది.
ఒక రోజు ఇన్స్టాలో ఓ మహిళతో పరిచయం అయ్యింది. ఆమె అందం చూస్తే హీరోయిన్లను తలపించేలా ఉండేది. మొదట చాటింగ్… తర్వాత కాల్స్… ఆ తర్వాత వీడియో కాల్స్… చివరకు ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది.
అక్కడి వరకూ చూస్తే ఇది సాధారణ ప్రేమకథలానే అనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.
ఆ యువకుడికి 21 ఏళ్లు… ఆమెకు 40 దాటింది!
వీరిద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల గ్యాప్. అయినా ప్రేమ మాత్రం ఏ లెక్కలు చూడలేదు. అతని ఫ్రెష్నెస్, ఆమె మేచ్యూరిటీ… ఇద్దరినీ దగ్గర చేసింది. ఆమె భర్త చనిపోయాడని సమాచారం. ఒంటరితనంలో ఉన్న ఆమెకు ఈ యువకుడు కొత్త జీవితం లా అనిపించాడట.
ఇదిలా ఉంటే… ఒక రోజు ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే “ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను” అని చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. దీంతో తల్లిదండ్రులు భయపడిపోయారు.
తల్లి పంపిన ఒక మెసేజ్ అతని మనసును కదిలించింది. “నువ్వు బాగున్నావా? నీ కోసం భయపడుతున్నాం” అని మెసేజ్ పెట్టడంతో… రాత్రికి ఫోన్ చేశాడు.
“అమ్మ… నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్యతో ఆగ్రాలో ఉన్నాను” అని చెప్పేశాడు.
తల్లి ఒక్కసారిగా షాక్ అయింది. అయినా “నీకు నచ్చిన అమ్మాయిని తీసుకుని రా” అని ఒప్పుకుంది. కానీ కొడుకు మాత్రం “నువ్వు ఒక్కతే రావాలి” అని షరతు పెట్టాడు.
ఆగ్రాకు వెళ్లిన తల్లి… ఇంట్లోకి వెళ్లగానే ఒక మహిళ కనిపించింది. చూడటానికి అందంగా ఉంది కానీ… వయసు మాత్రం తనకే దగ్గరగా ఉందని గ్రహించింది.
“ఇదే నా భార్య” అని కొడుకు చెప్పగానే ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది.
“నీకు పిచ్చి పట్టిందా?” అంటూ కొడుకుతో అక్కడే గొడవపడింది. కానీ ఆ యువకుడు మాత్రం ఒకే మాట చెప్పాడు.
“ఆమెనే నా జీవితం.”
తల్లి ఎంత బ్రతిమాలినా… ఎంత ఏడ్చినా… అతను వెనక్కి రాలేదు. చివరకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి చేరుకుంది.
ఇక అక్కడినుంచి అసలు కథ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ యువకుడి స్నేహితులు వారి ఫోటోలను బయటకు తీసి పోస్ట్ చేయడంతో… ఈ స్టోరీ వైరల్ అయిపోయింది. పేర్లు బయటకు రాకపోయినా… కథ మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాల చర్చ నడుస్తోంది.
ఒకవైపు “ప్రేమకి వయసుతో సంబంధం లేదు” అంటుంటే…
మరోవైపు “ఇది మోజు మాత్రమే… కొంతకాలానికి సమస్యలు మొదలవుతాయి” అంటున్నారు.
మరి నిజంగా ఇది ప్రేమేనా?
లేక క్షణిక భావోద్వేగమా?
ఈ కథకి హ్యాపీ ఎండింగ్ ఉంటుందా? లేక సోషల్ మీడియాలో చెప్పినట్టే కొత్త ట్విస్టులు వస్తాయా?
వేచి చూడాల్సిందే…
షోషల్ మీడియా సౌజన్యంతో

