రెవెన్యూ లో అధికారుల చేతివాటం

వీ డ్రీమ్స్ అనకాపల్లి

జిల్లాలో ప్రభుత్వ భూ రికార్డులు టెంపరింగ్ చేయడం కీలక రికార్డులు మాయం చేయడం రెవెన్యూలో కొందరు అధికారులు ఆరి తేరి ఉన్నారు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులే కబ్జాదారులకు సహకరిస్తున్నారు. దీనితో విలువైన ప్రభుత్వ భూములు కనుమరుగైపోతున్నాయి. జిల్లాలో ఉన్న అన్నీ మండల కార్యాలయాల్లోనూ రికార్డుల స్వచ్చికరణ ఊసేలేదు. దీనితో, కొన్ని వేల మంది రైతులు రీ సర్వే లో తీవ్రంగా నష్టపోయారు కానీ, కొందరు రెవెన్యూ అధికారులకు సర్వేయర్లకు ఈ రీ సర్వే కాసులు కురిపించింది. రెవెన్యూ రికార్డులలో లేని డి- పట్టా భూములను రీ సర్వే లో ఉన్నట్టుగా చూపించి, కొందరు రెవెన్యూ అధికారులు కాసులు వెనకేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరనే అనకాపల్లి మండలం వూడేరు గ్రామం లో సర్వే నెం 27 వాస్తవ రికార్డులలో అంటే సర్వే సెటిల్మెంట్ దాఖల ఏ 5.38 సెంట్లు గయాళు గానూ నమోదై ఉన్నది. అయితే ఈ భూమిని రీ సర్వే లో LP No. 788, ఖాతా నెం 423 తో ఒక వ్యక్తి పేరుతో ఏ 1.494 సెంట్లు భూమి నమోదు చేశారు. వూడేరులో సర్వే నెం 27 సంబందించి అనకాపల్లి తహశీల్దారు కార్యాలయంలో ఉన్న అసైన్‌మెంట్ రిజిష్టరు లో కానీ, ఫారం 3 లో కానీ నమోదు కబడిలేదు. 22 ఆ లో సర్వే నెం 27 విస్తీర్ణం ఏ 5.38 సెంట్లు నిషేధిత భూముల జాబితాలో నమోదై ఉన్నది. నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూమిని రీ సర్వే అయిన తరువాత ఒక వ్యక్తి పేరున డి- ఫారం పట్టగా ఏ విధంగా నమోదు చేశారో అధికారులు తెలుసుకోవాలసి ఉన్నది. జిల్లాలో పలు తహశీల్దారు కార్యాలయాల్లో కీలకమైన రికార్డులు (మాన్యూవల్ ఆడంగల్ ) కనుమరుగయ్యాయి. తప్పులు చేసిన అధికారులపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో కొందరు అధికారులు మరింత బరీ తెగిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తి గత అవసరాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, కాళ్ళు అరిగెలా తిరుగుతున్నా, పరిష్కారం కావడం లేదని, ఆవేదన వినిపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వెబ్లాండ్ లో ఒకరి భూమికి బదులు వేరొకరి భూమిని నమోదు చేసి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికారులు చేసిన తప్పిదాలకు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కనీసం రీ సర్వే లో అయినా ఇటువాటి తప్పులు సరిదిద్దే అవకాశం వస్తుందని రైతులు ఆనంద పడినా వారి ఆనందం ఆవిరైపోతోంది. మండలంలోని భట్లపూడి లో రమణ అనే రైతు ఒక 0.30 సెంట్లు భూమిని కొనుగోలు చేసుకున్నాడు. అయితే తాను కొనుగోలు చేసుకున్న విస్తీర్ణం భూమిని రీ సర్వే లో తప్పుడు సర్వే నెం తో పోర్టు కావడంతో ఆ రైతు ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అండ చూసుకుని ఒక అధికారి పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అధికారి పైనే గతంలో మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఈ అధికారి గత ప్రభుత్వంలో జరిగిన లాండ్ పూలింగ్ వ్యవహారంలో ప్రభుత్వ భూములకు నకిలీ డి- ఫారం పట్టాలు సృష్టించి వందలాది ఎకరాలు దోచేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం పైనే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక CID విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
సి ఐ డి విచారణ ఏమైందో ఇఃతవరకు తెలియలేదు
ఇలా రెవెన్యూ కార్యాలయాల్లో నిత్యం ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మౌనం పాటించడం పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీ సర్వే లో ఎక్కువగా సచివాలయ సర్వేయర్ల హవా కొనసాగిందనే ప్రచారం ఉంది. చాలా వరకు వి ఆర్ వో లకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడంతో సర్వేయర్లు తమ లాగిన్ తో పాటు వి ఆర్ వో ల లాగిన్ లో కూడా వారే నమోదు చేయడంతో జరిగిన తప్పులూ వి ఆర్ వో లు ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. తక్షణమే వూడేరు సర్వే నెం 27 పై విచారణ జరపాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈ వ్యవహారం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సిద్ద పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *