వీ డ్రీమ్స్ అనకాపల్లి
రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రీత్యా ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అభివృద్ధిని కూడా సాధించాలంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారానికి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని పాపయ్య పాలెం పాపయ్య సంతపాలెం గ్రామాల్లో కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెరువు పనుల్లో ఉన్న గ్రామస్తులు వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల ఉన్నతిని కాంక్షిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒకటయ్యాయన్నారు. కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండవని చేస్తున్న తప్పుడు ఆరోపణలు పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. అంతకన్నా మెరుగైన పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటికే కూటమి మెరుగైన ఆరు పథకాలను ప్రకటించామన్నారు. గ్రామాబ్యూదయానికి పెద్దపీట వేస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు సీఎం రిత్విక్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగల శక్తి సామర్థ్యాలు సీఎం రమేష్ గారికి ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అండదండల అవసరమన్నారు. అనకాపల్లి జిల్లా వెనుకబాటును గుర్తించే ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ఎంపీ అభ్యర్థిగా రమేష్ గారిని అనకాపల్లిలో నిలబెట్టారన్నారు. సీఎం రమేష్, కొణతాల రామకృష్ణ ల గెలుపుతో అనకాపల్లి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు, ఆయా పార్టీలు ప్రతినిధులు కరణం శ్రీను (చెక్కలన్న), శెట్టి వెంకటరమణ, గంగిరెడ్ల గోవింద, ఆళ్ల శ్రీను, బొట్టా నూకరాజు, పూడి అప్పలనాయుడు, గంగిరెడ్ల చెల్లారావు, బొట్టా అప్పలరాజు, మాకవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.