స్కాం అధికారుల చేతికే పగ్గాలు
వీ డ్రీమ్స్ ప్రత్యేకం
వైసీపీ హాయం లో అనకాపల్లి జిల్లా లో జరిగిన లాండ్ పులింగ్ కుంభకోణం బయటపడుతోంది.
దేశం నాయకులు దాడి, పీల గోవింద్ దీని పై దర్యాప్తు జరిపి
అవక తవకలు కు పాల్పడిన
అధికారులను, లబ్ధి పొంది ప్రభుత్వం కు నష్టం కగించినవారిని శిక్షించాలని
డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దీనిపై సిఐడి
విచారణ జర్పుతోంది.
అవకతవకలు జరిగాయి అనడానికి నిదర్శనం
1996 లో డి ఫారం పట్టాలు జారీ అయినట్టు రికార్డ్ సృష్టించి ప్రభుత్వ భూములు కొట్టేసారు అనడానికి నిదర్శనం వి డ్రీమ్స్ సంపాదించింది.
నకిలీ డి ఫారం పట్టాలు సృష్టించి చాలా వరకు ప్రభుత్వ భూమిని దొచేశారు. గత ప్రభుత్వం లో జరిగిన ల్యాండ్ ఫుల్లింగ్ లో ఎక్కువ 1996 సంవత్సరంలో ఇచ్చిన డీ ఫారం పట్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక నకిలీ డీ ఫారం పట్టా వీ డ్రీమ్స్ చేతికి చిక్కింది. ఈ పట్టా విశేషం ఏంటంటే సంతకం క్రింద 1996 అని రాసి ఉంది.ముద్ర మాత్రం రెండున్నరేళ్ల కింద ఏర్పడినఅనకాపల్లి జిల్లాది కావడం విశేషం.
సిఐడి అధికారులు ఈ ల్యాండ్ ఫుల్లింగ్ సమయంలో పనిచేసిన ప్రతి అధికారిని విచారించారు. అనకాపల్లి ఆర్డీఒ గా పని చేసిన చిన్ని కృష్ణ పై చాలా ఆరోపణలు వచ్చాయి.
అంతా లిటిగేషన్
విచారణ లో తగిన పురోగతి లేదని, ఆలస్యం జరిగితే లిటిగేషన్ లు పెరిగి గతంలో నియమించిన సిట్ ల గతే పడుతుందని జన సేన విమర్శిస్తోంది.
ఇదిలఉండగా పూలింగ్
కుంభకోణం లో కీలక పాత్ర పోషించిన అనకాపల్లి రెవెన్యూ అధికారి అదే సీట్ లో నేటి కి ఓ జన సేన నాయకుడి అండ తో కొనసాగడం పట్ల తెలుగు దేశం లో కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ఆరోపణలు గుప్పించి పదవి లో ఉన్న ఓ దేశం నాయకు డి ని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి బుధవారం విజయవాడలో కలిసి ల్యాండ్ పూలింగ్ నుండి ఎలా అయిన తనను బయట పడేయాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్ లో లబ్ధి పొందిన వైసిపి నాయకులు జనసేన ,దేశం లో కొందరు నాయకులు కుమ్మక్కయి నాటకాన్ని రక్తి కట్టించారు అని సిపిఐ,సిపిఎం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పాపం పేద రైతులు
లేఅవుట్ లు అభివృద్ధి చేసి
ప్లాట్ లు ఇస్తామని అప్పట్లో వైసీపీ నాయకులు చెప్పిన మాటలు నమ్మి న బడుగు రైతులు ఘోరం గా మోసపోయారు.
భూపతి పాలెం కోడూరు ల లో
తమకు ప్లాట్ లు ఇచ్చారని వాటిని తమకు చూపించాలని రెవెన్యూ సదస్సులో
పట్టాలు పట్టుకుని వచ్చిన పాపయ్యపాలెం,వేట జంగాలపాలెం రైతులకు
‘”ఏసీబీ దర్యాప్తు లో ఉంది ఇప్పుడు మేము ఏమీ చేయలేమని “తహశీల్దార్ జవాబు చెప్పారు
ఇటు సాగులో ఉన్న తమ
భూమి పోయి రైతులు ఇలా మోసపోతే వైసీపీ నాయకులు
ప్లాట్ లు ,డబ్బు కొట్టేసి టీడీపీ జనసెన నాయకుల్ని రెవెన్యూ అధికార్లను గుప్పిట్లో పెట్టుకొని
రాజ్యమేలుతున్నారు.
బాబు గారూ మీరు న్యాయం చేయగలరా…