వీ డ్రీమ్స్ అనకాపల్లి
రైతు పంటను నూరు శాతం ఇ-పంట నందు నమోదు చేయాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఇ-పంట నమోదు పై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం ఇ-పంట నమోదు పూర్తయిందని, 28వ తేదీలోగా నూరుశాతం ఇ-పంట నమోదుతో పాటు, ఇ-కెవైసీ కూడా పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్టరీ పక్రియ నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని, లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయఅధికారి బి.మోహనరావు, డివిజను, మండల వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.
