నిర్భ‌యంగా చికెన్, కోడి గుడ్లు తినొచ్చు, జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి లేదు : జిల్లా క‌లెక్ట‌ర్ విజయ క్రిష్ణన్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి గానీ, ఆ ల‌క్ష‌ణాలు గ‌ల వ్యాధిగ్ర‌స్తు కోళ్లు గానీ లేవని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు దృవీక‌రించా ర‌ని జిల్లా క‌లెక్ట‌ర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. అందువ‌ల్ల ప్ర‌జ‌లు చికెన్‌, కోడిగుడ్ల‌ను నిర్భ‌యంగా తినవచ్చునని ప్రజలకు పిలిపునిచ్చారు. చికెన్, కోడిగుడ్ల వినియోగంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్న నేపద్యంలో మంగళవారం సాయంత్రం అనకాపల్లి పట్టణ స్థానిక ఎన్ టి ఆర్ స్టేడియం లో జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్ ) సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమనికి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, వైద్యుల నివేదిక‌ల ప్ర‌కారం జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ ల‌క్ష‌ణాలు ఎక్క‌డా లేవ‌ని, ప్ర‌జ‌లు ఎటువంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. పాఠ‌శాల‌లు, కెజిబివిలు, హాస్ట‌ళ్లు, సంక్షేమ పాఠ‌శాల‌ల విద్యార్ధులకు, అంగ‌న్‌వాడీ కేంద్రాల చిన్నారుల‌కు, త‌ల్లుల‌కు గుడ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే కాకుండా, వాటిని తీసుకొనే విధంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసే సిబ్బందిని చైత‌న్య ప‌రిచి, గుడ్ల‌ను వినియోగించే విధంగా చూడాల‌ని చెప్పారు. గుడ్ల‌ను క‌నీసం 70 డిగ్రీల వేడివ‌ద్ద ఉడికించిన‌ప్ప‌డు ఎటువంటి వ్యాధీ సోక‌ద‌ని, సూక్ష్మ‌జీవులు న‌శించిపోతాయ‌ని తెలిపారు.భారత దేశంలో వంటకాలను 100 డిగ్రీ ల సెంటి్గ్రేడ్ పైబడి వండే విధానం పాటించడం వల్ల
ఏ విధమైన బాక్టీరియా మరియు వైరస్ బ్రతికి బట్ట కట్ట గలిగె అవకాశం లేనందున ప్రజలందరూ నిర్భయంగా కోడి మాంసం మరియు గుడ్లను తినవచ్చునన్న నిపుణుల అభిప్రాయాలను కలెక్టర్ తెలియజేసారు.అనంతరం నెక్ వారు కలెక్టర్ చేతుల మీదుగా చికెన్ మరియు వినియోగ అవగాహనా పై గోడ పత్రికలను ఆవిష్కరింపజేశారు

ఈ కార్యక్రమంలో అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి షేక్ అయిషా, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి డాక్ట‌ర్ బి రామ మోహన్ రావు, అనకాపల్లి డిఎస్పీ ఎమ్ శ్రావణి, జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ టి శ్రీధర్, అనకాపల్లి చైర్మన్ కె. గంగిరెడ్డి, ఏ.పీ. కోళ్ల సమాఖ్య ప్రాంతీయ అధ్యక్షులు బి సాయినాధ్, ఇతర కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *