వీ డ్రీమ్స్ అనకాపల్లి
జిల్లా ఎస్.పి. కార్యాలయం ప్రాంగణంలో గల ఇ వి ఎం గొడౌను ను జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ క్రిష్ణణ్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీచేసారు. గొడౌను సీళ్లను, సిసి కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యకమంలో జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి వై. సత్యనారాయణరావు, రెవిన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరరావు, ఎలక్షన్ సెక్టను సూపరింటెండెంటు ఎస్.ఎస్.వి.నాయుడు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
