వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి తహ సీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ఈరోజు మధ్యాహ్నం నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనికి వెళ్లి తలుపులు మూసిన అధి కారులు కార్యాలయంలోని ఓ గదిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) కన్నబాబును ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్న అధికారులు. ఒక రైతు తన వ్యవసాయ భూమిలో బోరు చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను రైతు నుండి 12 వేల రూపాయిలు డిమాండ్ చేసారని తెలుస్తుంది ఈ మేరకు రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించి నట్లు తెలింది.కాగా నక్కపల్లి తహసీల్దారు కార్యాలయంలో కన్న బాబు టైపిస్ట్ గా బదిలీ అయి వచ్చారు అయితే ఇక్కడ ఆరై పోస్ట్ ఖాలీగా ఉండటంతో కన్న బాబు కి ఆరై గా అదనపు భాద్యతలను చేపట్టారు. గత కొంత కాలంగా రెవెన్యూ సిబ్బంది పై అవినీతి ఆరోపణలు రెవెన్యూ సిబ్బందిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.ఇంకా వివరాలు తెలియల్సి ఉంది.
