నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలి

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ఈనెల 28 నుండి వచ్చే నెల 27 వరకు జరిగే నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగ శ్రీను విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు .ఈ నెల 28 న అమ్మవారి జాతర 29 న కొత్త అమావాస్య ఉత్సవం 30న ఉగాది తో పాటు నెల రోజులు (ఏప్రిల్ 27 వరకు) ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ఇప్పటికే తాటాకు పందిళ్ళతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు . ఆలయానికి రంగులు వేయటం జరిగిందన్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించటం పూర్తయిందని తెలిపారు. స్వాగత ఏర్పాటు చేశామని తెలిపారు.వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు .నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఉత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంచార్జ్ భీమర శెట్టి రామకృష్ణ (రామ్కి ) మాజీ మంత్రి దాడి వీరభద్రరావు , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర సహాయ సహకారాలతో సూచనలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి అనిత శాసనసభ్యులు విచ్చేస్తారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రివర్యులు అందజేస్తారని తెలిపారు .ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు .సాంస్కృతిక కార్యక్రమాలు నెలరోజులు పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఉత్సవ నిర్వహణ అధికారి శోభారాణి కార్యనిర్వాహన అధికారి వెంపలి రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .పోలీస్ పికెట్ తో పాటు మెడికల్ క్యాంపు ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తాగునీరు మరుగుదొడ్ల సదుపాయాలను ఇప్పటికే మెరుగుపరచడం జరిగిందన్నారు.ఆక్రమణలను తొలగించటం జరుగుతుందన్నారు . ధర్మకర్తలు రవికుమార్, సతీష్, ఆనంద్, కాండ్రేగుల జగ్గారావు, మారిశెట్టి శంకర్రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *