(వీ డ్రీమ్స్ – అనకాపల్లి) ఎంపీ గా మంత్రి గా అనుభవం, రాష్ట్ర అభివృద్ధి పై మంచి అవగాహన కలిగిన
కొణతాల రామకృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రముఖసినీ నటుడు పృథ్వి కోరారు.బుదవారం ఆయన అనకాపల్లి పట్టణంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి కొణతాలరామకృష్ణ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ పై వోట్ ముద్రవేసి వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని అభ్యర్ధించారు. జగన్ ప్రజలిచ్చిన అధికారాన్ని స్వార్థం కోసం వాడుకొని రాష్ట్ర అభివృద్ధి నే గాలికి వదిలేశారని , వాడుకోవడం వదిలేయడం జగన్ నైజం అని ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటమి తప్పదనికూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని అన్నారు. పృథ్వి కి ఘనస్వాగతం లభించింది. జనసేన నాయకులు దూలం గోపి, మళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు