సామాజిక పరివర్తన ద్వారా కాన్సర్ నివారించవచ్చు : జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్

వీ డ్రీమ్స్, అగనంపూడి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇన్‌స్టిట్యూట్ అయిన విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ కేంద్రం, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధన కేంద్రంలో మంగళవారం ’పబ్లిక్ ఔట్రీచ్ కార్యక్రమంను‘ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ముఖ్య అతిథి గా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హోమి బాబా కాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధన కేంద్రం నిర్వహించే పబ్లిక్ ఔట్రీచ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ రోగుల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ, క్యాన్సర్ గురించి భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, ఋతు పరిశుభ్రతను కాపాడుకోండి ఆని తెలిపారు, స్థానికులకు అవగాహన కల్పించండి మరియు నివారణ చర్యలు తీసుకోండి, ముందస్తు గుర్తింపు చికిత్స కోసం ముందుకు రండి ఆని పిలిపునిచ్చారు సంరక్షణ మరియు నివారణ కోసం చేసే ఆసుపత్రి ప్రయత్నాలను ఉపయోగించు కోండి అని ప్రజలను ఉద్దేశించి ఆమె అన్నారు.   

హోమి బాబా కాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధన కేంద్రం విశాఖపట్నం డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ పాటన్ శెట్టి మాట్లాడుతు ప్రియమైన నా సైనికులారా మీ అందరి సేవలు (ఎమ్.ఎల్.హెచ్.పి.లు, ఎ.ఎన్.ఎమ్.లు, మెడికల్ అధికారులు ), అద్భుతమైనవి, మీలో ప్రతిఒక్కరు ఒక ఛాంపియన్ ఎందుకంటే ఒకప్పటి కష్టసాధ్యమైన కెన్సర్ మొదటి దశ గుర్తింపు పై, మీ అందరికీ మేము ఇచ్చిన ప్రాధమిక స్థాయి శిక్షణ మొదటి దశలో కాన్సర్ ను గుర్తించడనికి అవకాశం కల్గుతుందని దీని వలన కాన్సర్ నివారణ మరియు చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు దీనికి అందరం కలిసుకట్టుగా కృషి చేద్దామని అన్నారు

ఈకార్యక్రమంలో పంజాబ్‌ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ గులియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. రవి కుమార్, జిల్లా ఇమ్మ్యూనైజషన్ అధికారి డాక్టర్ కె చంద్ర శేఖర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఎ.ఎన్.ఎమ్ లు, మెడికల్ అధికారులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ విజయ్ క్రిష్ణన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *