వీ డ్రీమ్స్, నర్సీపట్నం
అనకాపల్లి జిల్లాలో సహకార శాఖ ఆధీనంలో గల పిఎసిఎస్ లో కార్యదర్శులు కోట్లు కొల్లగొట్టి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగినా రికవరీలు గాని చర్యలు లేవని సంబంధిత శాఖ అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని వీటన్నింటిపై సహకార శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ప్రజా సంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా లో 98 పిఎసిఎస్ లు ఉన్నాయని వాటిలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో జీవో నెంబర్ 51, 52 ల ద్వారా విచారణలు జరిపారని వాటిని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు రోలుగుంట మండలంలో జానకిరామపురం పిఎసిఎస్ లో సుమారు 40 లక్షల నిర్ధారించారని నర్సీపట్నం మండలంలో చెట్టు పల్లి పీఏసీఎస్ 95 లక్షలు నిర్ధారించి ఆక్స్ న్ నోటీసులు జారీ చేశారని అయినా చర్యలు ఎక్కడ అని ప్రశ్నించారు. దీంతో గుంటూరులో గల రాష్ట్ర సహకార కమిషనర్ కు పూర్తి నివేదికతో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు.
