వీ డ్రీమ్స్ అనకాపల్లి
రవాణా ,పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఈ రోజు స్దానిక రింగ్ రోడ్ లో15 స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించామని రవాణా శాఖ అధికారాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీ ల్లో భాగంగా కొన్ని బస్సుల్లో నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించామని అన్నారు. 5 స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధించారు.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు. అన్ని విద్యా సంస్థలు తమ బస్సులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
ఈ తనిఖీ లలో జిల్లా రవాణా శాఖ అధికారులు రమణ, గోపికృష్ణ, అమృత గ్రీష్మ మరియు గీత కావ్య పాటు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్సై శేఖరం పాల్గొన్నారు.
