వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రధానమంత్రి స్వామిత్వ స్కీమ్ ( సర్వే ఆప్ విలేజెస్ ఆబాడి ,మేపింగ్ విత్ ఇంప్రువైజ్డడ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ )
పై ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం అనకాపల్లిలో నిర్వహించారు. డివిజన్ స్థాయిలో జరిగిన ఈ శిక్షణా శిబిరంలో పంచాయతీ కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు,డిజిటల్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో రోవర్లు ఉపయోగించడం పై అదేవిధంగా క్యూజిఐస్ సాఫ్టువేర్ శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్క మండలం నుంచి ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,డిజిటల్ అసిస్టంట్లు హాజరయ్యారు. ఉదయం కార్యక్రమంలో స్వామిత్వ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్పై అలాగే ల్యాండ్ ప్రాపర్టీ మ్యాప్ తయారీ పై శిక్షణ ఇచ్చారు. మద్యాహ్నం కార్యక్రమంలో రోవర్ ఉపయోగించడం పై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సేకరించిన డేటాను క్యూజిఐఎస్ ను ఉపయోగించడం పై శిక్షణ ఇచ్చారు. సమావేశానికి హజరైన జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు ఇన్ చార్చ్ అసిస్టెంట్ డైరెక్టర్ బాబు స్వామిత్వ పధకం ప్రయోజనాలను వివరించారు) ఈ శిక్షణా కార్యక్రమం లో డిపిఒ ఆర్ శిరిషారాణి,ఎంపిడిఒ కె.వి.నరసింహారావు, ఇఒఆర్డి పి.వి.ఎస్.ఎస్.ప్రసాద్, మునగపాక ఇఒఆర్డి మామిడి సోమరాజు, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతి కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,సర్వేయర్ లు తదితరులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
