వీ డ్రీమ్స్ అనకాపల్లి
: జిల్లాలో మామిడి పంట ప్రస్తుతం పిందె దశల్లో ఉందని, ఈ దశలో శాస్త్రవేత్తలు సూచించిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.ప్రభాకర రావు తెలిపారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మామిడి పూత విచ్చుకున్నప్పటినుంచి తేలికపాటి తడులతో ప్రారంభించి నీటిని ఇవ్వాలని తెలిపారు. పిందె కట్టిన దశలో రెండవ దఫా సిఫారసు చేసిన ఎరువులను వేసుకోవాలన్నారు. తేనె మంచు పురుగు నివారణకు, బుప్రోఫిజిన్ 1.5 ml/lit లేదా బుప్రోఫిజిన్ + ఆసిఫెట్ 1g/lit లేదా డైనోటేఫ్యురాన్ 0.2g/lit తో పాటు వేప నూనె 3 మీ.లీ/లీ, జిగురు 0.5ml/lit కలిపి పిచికారి చేయాలని తెలిపారు.
తామర పురుగు నివారణకు, నీలం రంగు జిగురు అట్టలు చెట్టు మార్చి చెట్టుకు, ఒకటి చొప్పున పెట్టుకోవడం, పాదులో ఫాలిడాల్/క్లోరోపైరిఫాస్/వేప
పిండి వేయడం ద్వారా నిద్రావస్/కోశస్థ దశలను నిర్మూలించడం, ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా అసిఫేట్ 1.5 g లేదా ఇమిడా 0.5 మి.లీ.
లేదా థయోమెథాక్సామ్ 0.3 గ్రా లేదా స్పైనోశాద్ 0.4 మి.లీ. లేదా
ప్రొఫెనోఫాస్2 మీ.లీ./లీ. లేదా అసిటామీప్రిడ్ 1 g/లీ. లేదా డెైమిథోయేట్
2 మి.ఈ. లేదా వేపనూనె10000 ppm 2 మి.లీ/.లీ. పిచికారి చేయాలన్నారు. నాణ్యమైన పండ్ల దిగుబడికి కాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పండ్ల కవర్లను తొడగాలని తెలిపారు.
అధికంగా పూత, పిందె రాలుతున్నప్పుడు ప్లానోఫిక్స్ 2 మిలి/10 లి నీటికి కలిపి, డోసు ఎక్కువ కాకుండా, వేరే ఇతర మందులతో కలపకుండా ఉదయం/సాయంకాల సమయాల్లో పిచికారి చేయాలన్నారు.
జీవన ఎరువులను 250 గ్రా చొప్పున పశువుల ఎరువులో కలిపి వాడుకోవడం ద్వారా మొక్కకి పోషకాల లభ్యతను పెంచవచ్చునని,
కాయ పెరిగే దశలో 13:0:45 10గ్రా/లి. యూరియా 5గ్రా/లి పిచికారి చేసినచో కాయ ఎదుగుదలకు తోడ్పడుతాయని అయన తెలిపారు.
