గత తహసీల్దార్ అక్రమాలు
ఆర్డీఒ కార్యాలయంలో పునరావాసం
వీ డ్రీమ్స్ ప్రత్యేకం
కంచే చేను మేసింది అన్నచందం గా ఉంది అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో అధికారుల పరిస్థితి. ప్రభుత్వ భూములను కాపాడ వలసిన అధికారులే గుడ్డిగా కళ్లు మూసుకుని కరపత్రాలు పంచినట్లు ప్రభుత్వ భూములను నకిలీ పట్టాలను సృష్టించి అంగట్లో అమ్మేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వాగు పోరంబోకు, గెడ్డా పోరంబోకు,రస్తా వంటి భూములు నిషేద జాబితాలో ఉన్నాయి .ఈ భూములను ఎవరికి పంపిణీ చెయ్యకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి. కాని అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో అధికారుల తీరే సెపరేట్.మనలను అడిగేవాడు ఎవడు అన్నట్లు గా రస్తా భూమిని,కొండా పోరంబోకు భూములనకు నకిలీ పట్టాలను సృష్టించి ప్రభుత్వ భూములను అప్పనంగా దోచి పెడుతున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక తహసీల్దారు ఏకంగా సీతానగరం శివారు సుందరయ్య పేట గ్రామంలో సర్వే నెంబరు 428 రస్తా పోరంబోకు భూమిలో ఇల్లు కట్టు కొనేందుకు ఏకంగా ఎల్ పిసి ఇచ్చేసారు.ఇలాంటి నిషేధ భూములను ఎవరు ముట్టుకోకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కొందరు ఆక్రమణదారులు అనకాపల్లి మండలం లో వాగు,గెడ్డ పోరంబోకు భూములను దర్జాగా ఆక్రమించి సాగు చేస్తున్నారు. రేబాక గ్రామంలో ఏకంగా గెడ్డా పోరంబోకు లో ఇళ్లే నిర్మించారు. అయిన రెవెన్యూ అధికారులు అటుగా కన్నెత్తి కూడ చూడలేదు. ఆక్రమణ దారులకు అనకాపల్లి తహసీల్దారు కార్యాలయం కల్పవృక్షం గా తయారైంది.ఇక్కడ కాసులు ఇస్తే చాలు నిబంధనలను పక్కన పెట్టి నిషేధ భూములను చేతిలో పెడతారు. గతంలో కశింకోట మండలం ఉగ్గిన పాలెం సర్వే నెంబరు 88 వాగు పోరంబోకు భూమిని అదే గ్రామ సర్పంచ్ బలిజ ముసిలి నాయడు అప్పటి తహసీల్దారు సుధాకర్ లు కలిసి వాగు పోరంబోకు భూమిపై కన్నేసారు.సుజల స్రవంతి లో ఈ భూమి పోతుందని తెలుసుకుని ఒక నకిలీ డీ ఫారం పట్టాను సృష్టించి ఏకంగా బలిజ ముసిలి నాయుడు పేర 2.50 ఎకరాలు అతుకుబడి పట్టాగా 2979 ఖాతా నెంబరు తో వెబ్ ల్యాండ్ 1లో నమోదు చేసిన విషయాన్ని గ్రామస్థులు “వీ డ్రీమ్స్ “దృష్టి కి తీసుకు వచ్చిన విషయాన్ని తెలిసిందే. అయితే గతంలోనే ఈ వార్తను “వీ డ్రీమ్స్” వెలుగులోకి తీసుకుని రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయి వెంటనే వెబ్ ల్యాండ్ లో బలిజ ముసిలి నాయుడు పేర నమోదు అయిన అతుకుబడి భూమిని తొలగించి వాగు పోరంబోకు గా నమోదు చేసారు. ఆ తర్వాత సుధాకర్ ని ఇక్కడ జెసి గా పనిచేసిన కల్పనా కుమారి సస్పెండ్ చేసిన విషయం తెలిసందే. ప్రస్తుతం సుధాకర్ అనకాపల్లి ఆర్డీఒ కార్యాలయంలో ఎఒ గా విధులను నిర్వహిస్తున్నారు. ఇలా రెవెన్యూ అధికారులే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తుంటే రెవెన్యూ భూములకు రక్షణ ఎవరని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.తాజాగా అనకాపల్లి మండలం సీతానగరం రెవిన్యూ (సుందరయ్య పేట శివారు) గ్రామంలో సర్వే నెంబరు 428 లో ఇటీవల పదవీ విరమణ రచేసిన ఒక తహసీల్దారు ఎల్పిసి ఇవ్వడంతో అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో గ్రామస్తులు నుండి ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేసారు.
ఎల్పిసి లో సర్వే నెంబర్ ఒకటే ఉంది.విస్తీర్ణం ఎంత ? సెంట్లా లేక ఎకరాలా ? అనేది పొందు పర్చలేదు. ఉండవలసిన అతి ముఖ్యమైన స్థల విస్తీర్ణం లేకపోతే దానికి అర్ధం ఏమిటి ? ఈ ఎల్పిసి తో ఆ సర్వే నెంబర్లో ఎక్కడి స్థలమైన అక్రమించడానికి అవకాశం ఉంది. హద్దులు సర్వే నెంబర్లను వేయలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఎన్నో అవినీతి బాగోతాలు చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం లో చేపట్టిన ల్యాండ్ ఫుల్లింగ్ లో కూడా ప్రభుత్వ భూములకు నకిలీ డి ఫారం పట్టాలు సృష్టించి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాజేసారనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఒక అధికారి ఈ తతంగాన్ని నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ అధికారిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన సంగతి తెలిసిందే. గత వైసిపి ప్రభుత్వం లో అధికార పార్టీ నేతలకు లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఇక్కడకి వచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన పలుకుబడిని ఉపయోగించి బదిలీ ని నిలుపుదల చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తిన్నాయి. అధికార పార్టీ అండ దండలు ఉండటంతో సదరు ఈ అధికారికి ఆడ్డే లేకుండా పోయిందని పలు ప్రజా సంఘాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికి పైసలు ఇవ్వందే ఫైలు ముందుకు సాగని పరిస్థితి అని చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ ఫుల్లింగ్ లో భారీగా ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు ఇచ్చి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి . అంతేకాకుండా ఆక్రమణలు పేరిట ప్రభుత్వ భూమిని లేపేసారు. ఈ ల్యాండ్ ఫుల్లింగ్ అంతా ఆప్ లైన్ లో జరగడంతో అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోయింది.2012 లో రెవెన్యూ శాఖ లో వెబ్ ల్యాండ్ ( ఆన్ లైన్ ) వ్యవస్థ మొదలైంది ఆన్ లైన్ వ్యవస్థ ఉండగా ఈ ల్యాండ్ ఫుల్లింగ్ వ్యవహారాన్ని ఆప్ లైన్ లో ఎందుకు చేసారో రెవెన్యూ అధికారులే చెప్పాలి గత ప్రభుత్వం లో జరిగిన ల్యాండ్ ఫుల్లింగ్ అవినీతి అక్రమాల ఆధారాలను సేకరించే పనిలో “వీ డ్రీమ్స్” నిమగ్నమై ఉంది. త్వరలో పూర్తి ఆధారాలతో “వీ డ్రీమ్స్” పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తుంది.

