వీ డ్రీమ్స్ అమరావతి
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వెబ్ లాండ్ డిజిటల్ సంతకాల సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. రైతుల సమస్యలను ఇటు రెవెన్యూ శాఖ గాని అటు రాజకీయ నాయకులు గాని పట్టించుకోక పోవడంతో రైతులు నరకం చూస్తున్నారు. డిజిటల్ సైన్ కోసం తహసీల్దారు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి నెల కొంటున్నది. వెబ్ ల్యాండ్ ఆపరేటర్ ఏదైనా సర్వే నెంబరు వెబ్ ల్యాండ్ లో మ్యుటేషన్ చేసేటప్పుడు అదే సర్వే నెంబర్లు తో ఉండే ఖాతాలు కలిగిన రైతుల భూముల డిజిటల్ సైన్ లు రీవోక్ (తొలగి పోవడం )తో రైతులకు కష్టాలు మొదలవుతున్నాయి.
తరచూ మాయమయ్యే ఈ డిజిటల్ సంతకం ను మారకుండా డిజిటల్ అరెస్ట్ చేయలేమా?
ఇదేమైనా బ్రహ్మ పదార్థ మా.?
డిజిటల్ సంతకం గురించి
తెలుసు కొందాం
ఏదైన సర్వే నంబర్ లో మార్పులు చేసి అక్కడ సైన్ చేస్తే
ఆ సర్వే లో అంతవరకు ఉన్న డిజిటల్ సంతకాలన్ని ఆటోమాటిక్ గా అంతర్ధానం
అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ..అదే సర్వే నంబర్ లో ఎంతమంది రైతులు ఉంటే అందరి ఖాతాలకు
డిజిటల్ సంతకం ఉండేలా చూడాలి
అయతే తహశీల్దార్లు తీరుబడి లేకపోవడం‘”తదితర”‘ కారణాలవలన ఆ పనిని పక్కన పెడతారు. దాంతో రైతులు కాళ్లరిగేలా తిరగవలసి వస్తోంది.
సాంకేతిక పరిష్కారం ఒకటే మార్గం
వెబ్లాండ్ నందు డిజిటల్ సైన్ రేవొకే అయ్యే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మ్యూటేషన్ చేసేటప్పుడు అదే సర్వే నెంబర్లతో వేర్వేరు ఖాతాలతో ఉన్న రైతులు డిజిటల్ సైన్ రేవొకే అవుతుందని ( *ఉ : ఒక సర్వే నెంబరులో 10 మంది రైతులు ఉంటే ఒకరు మ్యూటేషన్ చేయించుకుంటే మిగతా 9 మంది రైతుల యొక్క డిజిటల్ సైన్ రివొక్ అవుతుంది.ఇలా డిజిటల్ సైన్ ఆటోమేటిక్ గా రివోక్ అవ్వడం వలన రైతులు తహశీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్థితి
డిజిటల్ సంతకం “మాయం “కాకుండా ఏదైనా సాంకేతిక పరిష్కారం ను ప్రభుత్వం
అమల్లోకి తేవాలి. అంతవరకు ఈ అగచాట్లు తప్పేలా లేవు!

