అధ్వాన్నంగా కొప్పాక-అనకాపల్లి రోడ్డు

వీ డ్రీమ్స్ అనకాపల్లి

గత ప్రభుత్వంలో పదేపదే వినిపించేది గతుకుల రోడ్డు తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు మెరుగు పడతాయని ప్రజలు అనుకున్నారు.అయితే ప్రజలు అనుకున్నట్లు గానే అనకాపల్లి-విశాఖపట్,విశాఖపట్నం-అనకాపల్లి రోడ్డు పనులు మొదలుపెట్టారు. అయితే కొంతవరకు రోడ్డు పనులు పూర్తిచేసారు గాని కొప్పాక-అనకాపల్లి రోడ్డు కొంత వరకు పూర్తి చెయ్యకుండా వదిలేశారు దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహన చోదకులు నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కొప్పాక ఏలేరు కాలువ వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాది.దీంతో ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. సామాన్య ప్రజల కష్టాలను అర్దం చేసుకుని ఈ రోడ్డు పనులు పూర్తి చెయ్యాలని వాహన చోదకులు కోరుతున్నారు. ఎమ్మెల్యే లు,మంత్రులు ఈ రోడ్డు గుంటా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తేవాహన చోదకుల కష్టాలు తెలుస్తాయని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అనకాపల్లి కొప్పాక రోడ్డును త్వరిత గతంగా పూర్తి చెయ్యాలని కోరుకుంటున్నారు.

పూర్తిగా దెబ్బతిన్న కొప్పాక-అనకాపల్లి రోడ్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *