వీ డ్రీమ్స్, తిరుపతి
ఆంద్రప్రదేశ్ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్దానంలో మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.
బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్,లెక్చరర్లు, తదితరులు ఉన్నారు.
