ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం : అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు

వీ డ్రీమ్స్ అనకాపల్లి వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్) ద్వారా నేరుగా 10వ తరగతి, పదవ తరగతి ఉత్తీర్ణులయిన వారు నేరుగా ఇంటర్మీడియట్ లో చేరడానికి జూలై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం ఒక ప్రకటన లో కోరారు. జూలై 30వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి, ఆన్లైన్ విధానం ద్వారా గాని, జిల్లాలో ఉన్న ఓపెన్ స్కూల్ సహాయ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఓపెన్ స్కూల్ 10వ తరగతి లో చేరడానికి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలన్నారు. అలాగే చదవడం, రాయడం వచ్చి ఉండాలన్నారు. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, పాఠశాలలో ఏదో ఒక తరగతిలో చదివిన నాటి టీ. సీ., పుట్టిన తేదీ ధ్రువ పత్రం ఉండాలన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ లో చేరదలిచిన అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి, పదవ తరగతి ఉత్తీర్ణులైన మార్కుల జాబితా, టీ సీ, ఆధార్ కార్డు, సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వారి కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు వారి వికలత్వం అర్హత ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని చెప్పారు. 200 రూపాయల అపరాధ రుసుము తో ఆగస్టు 15 తేదీ వరకూ దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉందన్నారు. ఏపీ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తుల సమర్పించుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో ఫోన్ సంఖ్య. 80089 02915 లో సంప్రదించాలన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *