‘గిన్నిస్’ గుర్తించింది యావత్ ప్రపంచం కొనియాడింది కానీ యోగాంద్ర లో విజయ్ కి దక్కని స్థానం

వీ డ్రీమ్ అనకాపల్లి

దేశమంతటా యోగ సంబరాలతో మునిగిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేశారు. దీనిలో భాగంగానే ఈనెల 21న విశాఖపట్నం బీచ్ రోడ్లో యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సిద్ధం చేశారు. సుమారు ఆరు లక్షల మంది యోగలో పాల్గొనేందుకు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి భారీగా ప్రజలను తరలించేందుకు అధికార యంత్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది.ఇంతవరకు బాగానే ఉన్నా యోగాలో ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా భార్యాభర్తలు యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్న అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ తో పాటు అతని భార్య యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. యోగ డే కార్యక్రమాన్ని ఇంత అటహాసంగా చేపట్టిన జిల్లా యంత్రాంగం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించిన విజయ్ దంపతులను పట్టించుకోకపోవడం విచార కరమని యోగ ప్రేమికులు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొవాలని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగ డే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ యోగా కార్యక్రమంలో అనకాపల్లి వాసులైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లను సొంతం చేసుకున్న విజయ్ అతని భార్యలను ఈనెల 21న విశాఖ బీచ్ రోడ్ లో చేపట్టనున్న యోగ కార్యక్రమంలో వారికి అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని పలువురు యోగా ప్రేమికులు అభిప్రాయపడ్డారు. విజయ్ దంపతులు ద్వారా రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు యోగ పై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని వారంటున్నారు.ప్రపంచమంతా విజయ్ దంపతులను గుర్తించిన మనదేశంలో మీడియా మినహా రాజకీయ నాయకులు ఎవరు అంతగా స్పందించకపోవడం విచారకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక డైట్ కళాశాల అధినేత దాడి రత్నాకర్ లు విజయ్ దంపతులను అభినందించిన విషయం తెలిసిందే కానీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ లు కనీసం వీరిని అభినందికపోవడం విచారకరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ ఈ జంట యోగాలో సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ప్రతి ఒక్కరు కృషి చేస్తే బాగుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి విజయ్ దంపతులను నరేంద్ర మోడీ సభకు ఆహ్వానించి మోడీకి ఈ జంట సాధించిన ఘనతను వివరిస్తే బావు బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ దంపతులు ఒక్క అనకాపల్లి కే కాదు యావత్ దేశానికి గిన్నిస్ ద్వారా గొప్ప గుర్తింపు తెచ్చారు. యోగాంధ్ర వీరిని గౌరవించి
కార్యక్రమ ప్రతిష్ఠ ను పెంచేలా జిల్లా కలెక్టర్ తక్షణమే చర్య తీసుకొన డం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *