వీ డ్రీమ్స్ విశాఖపట్నం
ఆంద్రప్రదేశ్ లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఈ నెల 25 సాయంత్రం నాలుగు గంటలు నుండి 27 తేది సాయంత్రం నాలుగు గంటలు వరకు మద్యం దుకాణాలు మూసి వెయ్యాలని విశాఖ కలెక్టర్ ఎం ఎన్ హరేంద్ర ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేసారు. ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు మేరకు మద్యం షాపులను 25 సాయంత్రం నుండి 27 సాయంత్రం నాలుగు గంటలు వరకు మూసివేయబడతాయి.ఈ మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు జిల్లాలో అన్ని మద్యం షాపులు తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ లను కు సీలు వేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు..అలాగే వచ్చే నెల మూడవ తేదిన కౌటింగ్ సందర్భంగా ఆ రోజు కూడా మద్యం షాపులు మూసి వెయ్యడం జరుగుతుందని అన్నారు. సెలవు దినాల్లో ఎవరైనా మద్యం అమ్మితే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
