తీరేవికావు రెవెన్యూ వెతలుకూటమి తోనూ తప్పని కష్టాలు

వీ డ్రీమ్స్ అనకాపల్లి

గత ప్రభుత్వం హయాంలో జరిగిన రీ సర్వే లో రైతుల భూ వివరాలు తప్పులు తడకలుగా ఉండటంతో రైతులు రెవెన్యూ కార్యాలయాలకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.సమస్యను పరిస్కరించ వలసిన రెవెన్యూ అధికారులు చేతులెత్తేసారు.దీంతో రైతులు జిల్లా కలెక్టర్ కి తమ గోడును వినచెందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే నక్కపల్లి మండలం జి జగన్నాధపురం గ్రామానికి చెందిన కరణం పెద అప్పారావు కి జి జగన్నాధపురం గ్రామంలో సర్వే నెంబరు 36-1 లో‌ సుమారు 0-31 సెంట్లు జిరాయితి భూమి ఉంది సర్వే సెటిల్మెంట్ ప్రకారం ఈ భూమి రైతువారి పట్టాగా నమోదు అయి ఉంది.అయితే గత ప్రభుత్వం లో‌ జరిగిన రీ సర్వేలో నక్కపల్లి రెవెన్యూ అధికారులు పొరపాటున ఇనాం భూమిగా నమోదు చెయ్యడంతో అప్పటి నుండి ఆ రైతుకు కష్టాలు మొదలయ్యాయి. రికార్డు సవరణ కోసం నక్కపల్లి తహసీల్దారు కార్యాలయం చుట్టు చక్కర్లు కొట్టినా రైతు సమస్య పరిష్కారం కాలేదు.తహసీల్దారు ని కలిస్తే సవరణ మా పరిధిలో లేదని జిల్లా కలెక్టర్ ని కలవాలని చెప్పడంతో రైతు కరణం పెద అప్పారావు సోమవారం జిల్లా కలెక్టర్ కి అర్జీని సమర్పించుకున్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన కానూరు హరి బాబు అనే రైతు ‌భూమి కూడా రీ సర్వే లో ఇనాం భూమిగా నమోదు కావడంతో ఆ రైతు తహసీల్దారు కార్యాలయం చుట్టు కాళ్లు అరిగేలా తిరిగాడు. తన కొడుకు అప్పులు చేసి ఇటీవల చనిపోయాడని కొడుకు చేసిన అప్పులను తీర్చేందుకు కొంత భూమిని అమ్మేందుకు ప్రయత్నం చెయ్యగా తన భూమి కూడా ఇనాం భూమిగా‌ తప్పుగా నమోదు అయ్యింది. జిల్లాలో కొందరు విఆర్ఒ లు నిబద్ధతతో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అస్సలు ఈ సమస్య చాలా చిన్నదని చెప్పవచ్చు. జి జగన్నాధపురం విలేజ్ రెవెన్యూ అధికారి రికార్డును పరిశీలించి తన నివేదికను తహసీల్దారు కి సమర్పించవలసి ఉంటుంది. ఇనాం గా పొరపాటున పడితే 1956 సర్వే సెటిల్మెంట్ రికార్డును పరిశీలించి దాని ద్వారా తన నివేదికను సమర్పిస్తే సరిపోతుంది. కాని జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించక పోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్య చిన్నది అయినా సంవత్సరాలు పాటు కాళ్లు అరిగేలా రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరిగినా రైతుల సమస్య పరిష్కారం జరగటం లేదు.గత ప్రభుత్వం లో రీ సర్వే ప్రక్రియ అంతా విలేజ్ సర్వేయర్, విఆర్ఒ లు‌ వెబ్ ల్యాండ్ 2 లో రైతుల భూములను నమోదు చేసారు. అదరాబాదరాగా గత ప్రభుత్వం లో‌ రీ సర్వే జరగడంతో రైతుల భూ వివరాలు తప్పులు గా నమోదు అయ్యాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక రీ సర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి తప్పులు తడకలను సరిచేస్తామని రెవెన్యూ యంత్రాంగం ప్రకటన చేసింది. అయితే రీ సర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి రైతులు నుండి విజ్ణాప్తులు అందుకున్నారు. దీంతో రైతుల నుండి కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. రెవన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఇంత వరకు పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు దీంతో చేసేది లేక కలెక్టర్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు.అయినా గాని రైతుల కష్టాలు తీరడం లేదు.రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తె రైతుల కష్టాలు తీరుతాయని ప్రజా సంఘాలు అంటున్నాయి.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రీ సర్వే లో‌ జరిగిన తప్పుల తడకలను సరిచేసి రైతులను ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భూ రికార్డులను సరి చెయ్యాలంటు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించిన రైతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *