వీ డ్రీమ్స్ అనకాపల్లి
పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు పూర్తి అవగాహన కల్పించుకొని ఎన్నికల విధులను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలపై సెక్టారు అధికారులు, ప్రీసీడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రీసీడింగ్ అధికారులు మరియు ఇతర పోలింగు సిబ్బందికి సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో రెండవ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు, నిబంధనల మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ప్రక్రియలో సంయమనం పాటిస్తూ, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రం వద్ద అందించే పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని చెక్ లిస్ట్ లో పొందుపరచిన మేరకు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ అనంతరం తమ బృందంతో కలిసి నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, సూచనలను పాటిస్తూ బాధ్యతగా నడుచుకోవాలని అన్నారు. చిన్న తప్పిదానికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వర్తించాలని తెలికారు. జిల్లాలో 2885 మంది ఓటర్లు ఉన్నారని, సాయంత్రం నాలుగు గంటల తరువాత వరుసలో గల ఓటర్లకు టోకెను ఇచ్చి ఓటింగు పక్రియ పూర్తిచేయాలని తెలిపారు. పోలింగు కేంద్రంలో సిబ్బందికి అవసరమైన బోజన, వసతి సదుపాయాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నదన్నారు. పోలింగు కేంద్రంలో ప్రిసైడింగు అధికారి ఆదేశాలను సిబ్బంది తప్పని సరిగా పాటించాలని, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఎటువంటి యిబ్బందులు రాకుండా పోలింగు పూర్తిచేయాలని తెలిపారు. పోలింగు అనంతరం బ్యాలెట్ బాక్యులు, సామగ్రిని జాగ్రత్తంగా సీలు చేసి జివియంసి హైస్కూలు నందు ఏర్పాటుచేసిన రిసెప్షనులో జాగ్రత్తగా అందజేయాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, ట్రైనింగ్ ప్రోగ్రాం అధికారులు డి.పి.ఆర్.సి. జిల్లా కోర్డినేటరు నాగలక్ష్మి, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు పి.జయంతి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల సెక్షను సూపరింటెండెంటు ఎస్.వి.ఎస్.ఎస్. నాయుడు, డిప్యూటీ తహశీల్దారు పి. అరుణ చంద్ర ఎన్నికల నిబంధనలు మరియు పోలింగు విధానం, బ్యాలెట్ బాక్సులు నిర్వహణపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికలు విధులు కేటాయించబడ్డ 12 మంది సెక్టారు అధికారులు, 58 మంది ప్రిసైడింగ్ , సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 76 మంది యితర పోలింగు సిబ్బంది పాల్గొన్నారు.
