వీ డ్రీమ్స్ అనకాపల్లి
జిల్లా మధ్య నిషేధ అబ్కారి శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన మద్యం దుకాణాలను జిల్లా రెవిన్యూ అధికారి వై సత్యనారాయణ రావు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పక్రియ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేశారు. గురువారం స్థానిక గుండాల కూడలి వద్ద జి.వి.ఎమ్.సి., ఎస్. ఆర్. శంకరణ్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారి మరియు జిల్లా మధ్య నిషేధ అబ్కారి శాఖ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా మధ్యం దుకాణాలను కేటాయించారు.
ఈ సందర్బంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 15 మద్యం దుకాణాలకు 205 దరఖాస్తులు వచ్చాయి ఆయన తెలిపారు మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు వెంటనే అదేరోజు రిటైల్ ఎక్సయిజీ టాక్స్ రూ.5,41,667/- లేదా రూ.4,58,333/- మొదటి విడతగా చెల్లించి ప్రయోజనాలు లైసెన్స్ పొందాలని అయన తెలిపారు. ఈరోజు కల్లుగీత కార్మికులకు కేటాయించి న 15 మద్యం దుకాణాల కేటాయింపుకు నాన్ రిఫండబుల్ కింద 4 కోట్ల 10 లక్షల రూపాయల ఆదాయం సమాకూరిందని, 15 మధ్యం దుకాణాలు కేటాయింపుకు లైసెన్స్ ఫీజు కింద ఈరోజు 78 లక్షల 75 వేల 3 రూపాయలు ఆదాయం లభించిందని ఆయన తెలిపారు.
లాటరీ ప్రక్రియలో డి.ఆర్.ఓ. వై. సత్యనారాయణ రావు, జిల్లా మధ్య నిషేధ అబ్కారి శాఖ అధికారి వి.సుధీర్
సహాయ మధ్య నిషేధ అబార్కి అధికారి రాజా శేఖర్, సి.ఐ.లు, ఎస్.ఐ.లు, దరఖాస్తు దారులు, కుల సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

