వీ డ్రీమ్స్ అనకాపల్లి
మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటిపల్లి జేజీబాబు శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు .ఆయన ఐదేళ్లపాటు కౌన్సిలర్గ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్ర కు అనుచరునిగా వ్యవహరించారు. ఆయన సోదరులు కోటిపల్లి వీరభద్రరావు కూడా కౌన్సిలర్ గా చేశారు. కస్పా వీధికి చెందిన ఈయన విశ్వబ్రాహ్మణ సంఘానికి స్వర్ణకారుల సంఘానికి నాయకత్వం వహించారు. కీలక బాధ్యతలు నిర్వహించారు . దాడి వీరభద్ర రావు కు అనుచరునిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తున్నారు. భార్య కుమారులు ఉన్నారు మరణ వార్త ఆనుచర్లను విషాదంలో ముంచెత్తింది. విశ్వబ్రాహ్మణ సమాజంలో నిరాశ నిస్పృహలు అలముకున్నాయి. జేజిబాబు మృతి పట్ల మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు,డైట్ విద్యా సంస్థ అధినేత దాడి రత్నాకర్,పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
