వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఉత్తరాంధ్ర కి ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈనెల 25 శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు తెలియజేశారు. సోమవారం శ్రీ గౌరీ పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల 22వ తారీఖు న బుధవారం ఆలయం వద్ద శ్రీ గౌరీ పరమేశ్వరుల వార్షిక కల్యాణం,అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు భారీ సారి ఊరేగింపు జరుగుతుందని తెలియజేశారు. ఈ ఏడాది సుమారు 37 భారీ స్టేజ్ ప్రోగ్రాములు, 10 నేల వేషాలు, కలకత్తా వారిచే భారీ విద్యుత్ అలంకరణ, మందుగుండు సీతారామయ్యగారిచే భారీ బాణ సంచా హంగామా, మళ్ల జగన్నాథ్ కల్యాణ మండపంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుందని, పండగ రోజు భక్తులు సహాయ సహకారాలతో ఉచిత ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు ( చైర్మన్ ), కొణతాల శ్రీనివాసరావు ( కార్యదర్శి ), కొణతాల నూక మహాలక్ష్మినాయుడు ( కోశాధికారి ), కొణతాల ప్రసాద్ ( ఉపాధ్యక్షులు ), పి. వి. రమణ ( కన్వీనర్ ), పి. వి. సత్యనారాయణ ( ఉప కోశాధికారి ),, ఉత్సవ నిర్వాహకులు గండేపల్లి మురళి, కాండ్రేగుల విశ్వేశ్వరరావు, ఎల్లపు వాసు,మద్దాల రాజు, కొణతాల లోకేష్, బుద్ధ తేజ తదితరులు పాల్గొన్నారు.
