పకడ్బందీగా రీ సర్వే పైలట్ గ్రామాల్లో ప్రారంభం

వీ డ్రీమ్స్  స్పెషల్

గ్రామ సర్వే మొత్తం ఒక సర్వేయర్,వీఆర్వోల చేతిలో పెట్టి త్వరగా పూర్తి చెయ్యమని తొందర పెట్టడం కన్నా సరైన పద్దతిలో స్థిమితం గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మండలానికి ఒక గ్రామం వంతున కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ తగినంత మంది సర్వేయర్ లు, సిబ్బంది ని ఏర్పాటు చేసారు.200 నుండి 250 ఎకరాలను ఒక బ్లాకు గా నిర్ణయించి సర్వే టీం లను నియమించారు. ఒక్కో టీం లో ఇద్దరు గ్రామ సర్వేయర్ లు,ఒక విఆర్ఒ,ఒక గ్రామ రెవెన్యూ సహయకుడు ఉంటారు. అంతేగాక ఒక గ్రామ సర్వేయర్ ఒక విఆర్ఒ లను గ్రామంలో రైతులకు తగిన సమాచారం ఇచ్చేందుకు, సహకరించేందుకు ప్రత్యేకంగా ఒక టీం గా ఏర్పాటు చేసారు.

సర్వే జరిగే తీరు :

ముందుగా గ్రామ సరిహద్దులను గుర్తించి స్దిరీకరిస్తారు.త్వరగా200 నుండి 250 ఎకరాలు బ్లాకులు గా విభజించి వాటి సరిహద్దు లను గుర్తిస్తారు. తర్వాత ఆయా బ్లాకుల లోని భూ యజమానులకు సర్వే జరిగే తేది లను నోటీసులు ద్వారా తెలియజేస్తారు. సర్వే టీంలు సర్వే నెంబర్లు వారి భూముల విస్దీర్ణాలను వెబ్ ల్యాండ్ వివరాలతో సరి పోల్చి తప్పుల ఉంటే రికార్డులను సరి దిద్దుతారు.ఇది చాలా కీలకమైన పని క్షేత్ర స్థాయిని, రికార్డులను సరి చూసి తేడాలు ఉంటే రైతులతో మాట్లాడి వారికి పరిస్థితిని తెలియజేస్తారు. అడంగల్ తదితర రికార్డు లలో గల భూ యజమానుల పేర్లను సర్వే సబ్ డివిజన్ వారీగా సరి చేస్తారు. చనిపోయిన వారి పేర్లు ఉంటే వాటిని తొలగించి వారసుల పేర్లను నమోదు చేస్తారు. దొంగ పాస్ పుస్తకాలు, అడంగల్ తదితర రికార్డులలో అక్రమంగా చేరిన పేర్లు ఉంటే వాటిని తొలగిస్తారు. ఆధార్,మొబైల్ నెంబర్లు తో పేర్లు సరి చెయ్యడం జరుగుతుంది.వ్యవసాయేతర భూములను గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. మ్యుటేషన్ లు అవసరం అయితే వాటిని పూర్తి చేస్తారు. ఈ పనులు అన్నింటినీ తహసీల్దారు లు పర్యవేక్షిస్తారు. సమస్యలు ఉంటే మొబైల్, మెజిస్ట్రేట్, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఒ తదితరులు సాయం తో పరిష్కరిస్తారు.

గుల్లే పల్లి లో రీ సర్వే కి సూచనలు ఇస్తున్న సబ్బవరం తహసీల్దారు చిన్ని కృష్ణ, చిత్రంలో విఆర్ఒ అనంత్,తదితరులు
గుల్లేపల్లి లో రీ సర్వే చేస్తున్న సర్వే అధికారులు
రాంబిల్లి మండలం రాంబిల్లి గ్రామంలో రీ సర్వే చేస్తున్న మండల సర్వేయర్ త్రిమూర్తులు తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *